బాధితులకు న్యాయం చేసే అదృష్టం పోలీసులదే
Published Mon, Aug 1 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
ఏలూరు అర్బన్ : సమాజంలో ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడే అవకాశం పోలీసులకు మాత్రమే లభించే గొప్ప అవకాశమని జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ అన్నారు. ఆదివారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు.ఒత్తిళ్ల మధ్య విధి నిర్వహణలో పోలీసు ఉద్యోగం నిజమైన కత్తిసాము అని ఎస్పీ అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఎస్సైలు పి.పోతురాజు, పీవీవీ కుమార్, కె.నాగేశ్వరరావు, జి.లీలావతి, పి.రాజు, హెచ్‌సీ కేవీఆర్.కృష్ణ, కానిస్టేబుళ్లు బి.సత్యనారాయణ, ఎండీఎస్ గోరి, ఎస్‌వీ.ప్రసాద్, డీఎస్.నారాయణలకు శుభాకాంక్షలందించారు. ఏలూరు డీఎస్పీ, గోగుల వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ, పి.భాస్కరరావు,సంఘం అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement