జనవరి 1 నుంచి ప్రీమియం వసూళ్లు | Premium collections from January 1 | Sakshi
Sakshi News home page

జనవరి 1 నుంచి ప్రీమియం వసూళ్లు

Published Wed, Dec 14 2016 2:30 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Premium collections from January 1

ప్రభుత్వ బీమా పథకంపై సీఎం చంద్రబాబు నిర్ణయం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ బీమా పాలసీకి సంబంధించిన సొమ్ము వసూళ్లను వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఫిబ్రవరి 28 తేదీలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) పరిధిలో 1.31 కోట్ల కుటుంబాలున్నాయి.

మరో 8 లక్షల కుటుంబాలు ఉద్యోగులు, పెన్షనర్ల రూపంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధి లోకి వస్తున్నారు. వీరు కాకుండా మిగిలిన వారికి కూడా.. ఒక్కొక్కరు ఏడాదికి రూ. 1,188 చెల్లిస్తే ఆరోగ్యశ్రీ తరహాలోనే మొత్తం 1,038 జబ్బులకు వైద్యమం దించాలనేది ప్రభుత్వ బీమా విధాన ఉద్దేశం. కుటుంబంలో నలుగురు సభ్యులుంటే ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1,188 చొప్పున నలుగురికి రూ.4,752 చెల్లించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement