కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : 'నన్ను విడుదల చేయండి లేదా మెర్సీ కిల్లింగ్ ద్వారానైనా చంపేయండి' అంటూ ఓ ఖైదీ సీఎం, గవర్నర్‌లతో పాటు పదిమంది అధికారులకు పిటిషన్ పెట్టుకున్నాడు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చిన్నూరు గ్రామానికి చెందిన టి. శ్రీకాంత్(38) అనే వ్యక్తికి 1996లో జరిగిన ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడింది. అప్పటి నుంచి కడప సెంట్రల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.
14 సంవత్సరాల నుంచి జైలులోనే ఉంటున్నా అధికారులు తనను విడుదల చేయకుండా ఉన్నందుకు నిరసనగా ఈవిధంగా పిటిషన్ పెట్టుకున్నాడు. చాలా రోజులుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో-163 విడుదల చేసింది. 364-సెక్షన్ ప్రకారం తనను విడుదల చేయడం సాధ్యం కాదని అధికారులు తెలపడంతో మెర్సీ కిల్లింగ్ ద్వారానైనా చంపేయండంటూ పిటిషన్ పెట్టుకున్నాడు.
నన్ను చంపేయండి: ఓ ఖైదీ విన్నపం
Published Sun, Nov 29 2015 10:14 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM
Advertisement
Advertisement