మోత వేస్తున్న కూత
గ్రామీణ క్రీడ కబడ్డీకి రెండు దశాబ్దాలుగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. తన ఉనికినీ కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఈ తరుణంలో ప్రవేశించిన ప్రో కబడ్డీ ఈ క్రీడ దశాదిశను మార్చేంది అమలాపురం. దేశంలో క్రికెట్ తర్వాత అత్యంత ప్రేక్షకాదరణ పొందిన్న క్రీడలో కబడ్డీ తొలిస్థానానికి చేరింది. క్రీడాకారులను, క్రీడాభిమానులే కాదు.. చిన్నపిల్లలనూ ఇది అమితంగా ఆకర్షిస్తోంది. క్రీడాకారులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రో కబడ్డీ భరోసా కల్పించింది. ఒకప్పుడు భారత జట్టు ఏషియాడ్ క్రీడల్లో కబడ్డీ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించినా ఆ జట్టులోని సభ్యులు ఎవరో పెద్దగా తెలిసేది కాదు.
ఇప్పుడు ప్రో కబడ్డీ(ప్రొఫెషనల్ కబడ్డీ) పుణ్యమా అని మన దేశ కబడ్డీ క్రీడాకారులకు ఎనలేని గుర్తింపు, వాణిజ్య ప్రకటల్లో అవకాశాలు వస్తున్నాయి. తమకు ఇంతగా గుర్తింపు తెచ్చింది ప్రో కబడ్డీయేనని క్రీడాకారులు, న్యాయనిర్ణేతలు చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో గురువారం నుంచి ఆరంభమైన జాతీయ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు వచ్చిన కోచ్‌లు, క్రీడాకారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.