మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్ల కోసా రి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. సౌకర్యాల విషయంలో ప్రతీసారి భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. గత జాతర సందర్భంగా కొంత మేరకు సమస్యలు తగ్గినా ఈసారి 2014 ఫిబ్రవ రి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతరకు ముందస్తుగానే భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
నెరవేరని హామీలు..
మేడారంలో గిరిజన మ్యూజియం, చిలకలగుట్టకు చు ట్టూ ఫెన్సింగ్, పస్రా నుంచి ఏటూరునాగారం వరకు రోడ్డు విస్తరణ పనుల హామీలు నెరవేరలేదు. గత జాతరలో *57కోట్ల వ్యయంతో హడావుడిగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రామాణాలు కొరవడ్డాయి. సీసీ రోడ్లు, చిన్నబోయినపల్లి-తాడ్వాయి మధ్య నిర్మించిన తారు రోడ్డు పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కన్పించింది. జాతర సమయం వరకూ అభివృద్ధి పను లు జరగడంతో దేవతల దర్శనానికి ముందస్తుగా వచ్చి న భక్తులకు ఇబ్బంది కలిగింది. తాత్కాలిక మరుగుదొ డ్లు పూర్తికాలేదు. నీటి సరఫరా లేక అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. తాగునీటి కొరత వేధించింది.
ఈసారైనా ముందస్తుగా చేపట్టాలి
ఈసారి జరిగే జాతరకు తరలివచ్చే లక్షాలాది మంది భక్తుల సౌకర్యార్థం ముందుగానే అభివృద్ధి పనులు పూర్తి చేసేలా కలెక్టర్ జాతరపై పూర్తి స్థాయిలో చొరవచూపాల్సిన అవసం ఉంది. ఇందుకు నిధుల కొరత రాకుండా జాగ్రత్త పడాలి. నార్లాపూర్ నుంచి జంపన్నవాగు వరకు ఉన్న రోడ్డు వెంట లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉటుంది. నార్లాపూర్ చెక్‌పోస్ట్ నుంచి కాల్వపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలి. భక్తులు సులభంగా దేవతలను దర్శించుకునేందుకు క్యూలైన్లు పెంచాల్సిన అవస రం ఉంది. గత అనుభావలను దృష్టిలో పెట్టుకని అధికారులు జాతరలో భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలి.
పస్రా అతిథి గృహంలో సమావేశం
కలెక్టరేట్ : కలెక్టర్ కిషన్ శనివారం ఉదయం తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామాన్ని సందర్శించనున్నారు. శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న ఏర్పాట్లపై ఉదయం 10.30 గంటలకు సంబంధిత అధికారలతో క్షేత్ర పర్యటన నిర్వహిస్తారు. ఉదయం 9.00 గంటల కల్లా అధికారులంతా పస్రా అతిథి గృహానికి చేరుకోవాలని, సమీక్ష సమావేశం ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జాతర కష్టాలు తీరేనా..
Published Sat, Aug 24 2013 5:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement