దండేపల్లి, న్యూస్‌లైన్: పాఠశాల విద్యార్థులు పరీక్షల్లో సాధించిన మార్కులను ఇప్పటిదాకా ప్రోగ్రెస్ కార్డుల్లో నమోదు చేసేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలుకుతూ రాజీవ్ విద్యామిషన్ ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రోగ్రెస్ కార్డులకు బదులు ‘విద్యార్థి సంచిత సమగ్ర ప్రగతి నివేదిక’ పుస్తకాన్ని తయారు చేసింది. వాటిని ఇటీవలే పాఠశాలలకు సరఫరా చేసింది.
ఐదు తరగతుల వరకు..
గతంలో విద్యార్థికి తరగతికొక ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా ప్రాథమిక పాఠశాలలో చేరిన విద్యార్థికి మొదటి సంవత్సరం అందించిన సమగ్ర సంచిత ప్రగతి నివేదిక పుస్తకం ఐదో తరగతి పూర్తయ్యే వరకు పనిచేస్తుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థి సాధించిన ప్రగతి వివరాలు ఈ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ప్రగతి, మూల్యంకన వివరాలు, విద్యార్థిలో తరగతి వారీగా వచ్చే శారీరక, మానసిక మార్పులతోపాటు ఎత్తు, బరువు, కుటుంబ సభ్యుల వివరాలనూ ఇందులో పొందుపరుస్తారు. పరీక్షల్లో పొందిన మార్కులు, గ్రేడ్‌లనూ నమోదు చేస్తారు. ఇప్పటి వరకు పాఠ శాలల్లో అమలులో ఉన్న బాల ఆరోగ్య రక్ష కార్డులను పక్కన ఉంచి విద్యార్థుల ఆరోగ్య వివరాలను సంచిత సమగ్ర నివేదికలో పొందుపర్చనున్నారు. విద్యార్థులకు పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు తల్లిదండ్రులకు చూపించేందుకు మాత్రమే వీటిని అప్పుడప్పుడు విద్యార్థులకు ఇస్తారు. ఇలా విద్యార్థి సమగ్ర సమాచారం పొందుపరిచిన ఈ సమగ్ర సంచిత నివేదికను ఐదేళ్ల తర్వాత విద్యార్థులకు అందిస్తారు.
ఆలస్యంగా పాఠశాలలకు...
ఆర్వీఎం రూపొందించిన సంచిత సమగ్ర ప్రగతి నివేదిక పుస్తకాలు పాఠశాలలకు ఆలస్యంగా చేరాయి. త్రైమాసిక పరీక్షలు ముగిసి అర్ద సంవత్సరం పరీక్షలు ప్రారంభ సమయంలో సరఫరా అయ్యూరుు. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల మార్కులు మళ్లీ ఈ నివేదికలో పొందుపర్చాల్సి ఉండడంతో ఉపాధ్యాయులకు కొంత పనిభారం పెరిగింది.
ప్రోగ్రెస్ కార్డులకు స్వస్తి
Published Thu, Jan 9 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement