(డి.మురళీ కృష్ణారెడ్డి-ఎంవిపి కాలనీ)
విశాఖపట్నం: నగరంలో బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పైగా పండుగ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బ్యూటీపార్లర్‌పై మెరుపుదాడులు చేసి, వ్యభిచారం గుట్టురట్టు చేశారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఎంవిపి కాలనీలోని ఉషోదయ జంక్షన్‌లో మయూరి హోటల్ ఎదురుగా న్యూలుక్ బ్యూటీపార్లర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు జి.హేమావతితో పాటు నలుగురు యువతులను, ఓ విటుడుని అదుపులోకి తీసుకున్నారు. ఫెస్టివల్ ఆఫర్ల పేరుతో డిస్కౌంట్లు ఇస్తూ హేమవతి వ్యభిచారం నిర్వహిస్తోందని స్ధానికులు చెబుతున్నారు.
హేమావతి 2011లో ఈ పార్లర్ను ప్రారంభించింది. అయితే ఈ పార్లర్లో గత కొద్ది రోజులుగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అప్పటి నుంచి ఈ పార్లర్పై నిఘా ఉంచినట్లు టాస్క్ఫోర్స్ జోన్-1 సిఐ తిరుపతి రావు చెప్పారు. సోమవారం రాత్రి తమ సిబ్బందితో దాడి చేసి హేమావతితోపాటు నలుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఫెస్టివల్ ఆఫర్లతో బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం
Published Tue, Dec 24 2013 3:09 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement