
బ్యూటీ పార్లర్ లో వ్యభిచారం
విశాఖపట్టణం (వాల్తేరు): బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విశాఖ పోలీసులు బ్యూటీపార్లర్ పై దాడిచేసి వ్యభిచారం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు. ఈ సంఘటన విశాఖపట్నం నగరంలోని త్రీటౌన్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
చాప్స్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయారు. వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు యువతులతో పాటు మరో విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్ష రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.