
సాక్షి, కొవ్వూరు : పశ్చిమగోదావరి కొవ్వూరు టోల్ గేట్ వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొవ్వూరు రోడ్లు అధ్వానంగా ఉన్నా టోల్ ఫీజులు వసూలు చేస్తుండటంపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో టోల్‌గేట్ వద్దకు చేరుకుని కాపు ఉద్యమనేత ముద్రగడకు మద్దతుగా నిలిచారు. గుంతలతో నిండిన రోడ‍్లపై ప్రయాణం చేయలేకపోతున్నామని వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి రోడ్డు నిర్వహణ లేకుండానే టోల్ వసూలు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment