
సాక్షి, అమరావతి: రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారి అనిల్ కుమార్ మౌర్యను బయో డైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఎస్ అధికారి పీవీ చలపతిరావును రిలీవ్ చేయాలని మౌర్యను ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment