వైఎస్సార్ జిల్లా: ఓబులవారిపల్లి మండలం జీవీపురం గ్రామంలో కలకలం సృష్టించి వరుస హత్యలకు పాల్పడిన సైకో వెంటకరమణ అనే ఉన్మాదిని ఎట్టకేలకూ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఈ ఉన్మాది తుపాకి తీసుకుని కాలుస్తూ గందరగోళం సృష్టించి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నాడు. అతడు జరిపిన కాల్పులలో తోట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
పైగా ఆ ఉన్మాది పొలం తగాదాలో తన తండ్రిని కొట్టి చంపారని వెంకటరమణ చెప్పేవాడు. గతంలో ఒక వ్యక్తిని కాల్చిచంపడం, మరోవ్యక్తిని కత్తితో నరికి చంపినట్లు ఆరోపణలున్నాయి. తోట సుబ్రహ్మణ్యం ప్రాణాలకు కూడా ముప్పు ఉండటంతో అతడికి గతంలో గన్మన్ రక్షణ కూడా కల్పించారు. కానీ ఇటీవలి కాలంలో ఆ భద్రత ఉపసంహరించడంతో పొలం వద్దకు వెళ్లి మరీ తుపాకితో కాల్చిచంపాడని అంటున్నారు.
వరుస హత్యలకు పాల్పడ్డ సైకో అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం
Published Sat, Dec 14 2013 4:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement