obulavaripalli
-
రెండు లారీలు ఢీ : ఒకరు మృతి
ఓబులవారిపల్లె: మంగంపేట జాతీయరహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీ కొనడంతో డ్రైవర్ సుగ్రీవ్ సింగ్ (25) మృతి చెందాడు.పోలీసుల కథనం మేరకు మంగంపేట ప్రైవేట్ కంపెనీకి చెందిన బెరైటీస్ ఖనిజం సరఫరా చేసే ఏపీ 39యూబీబీ109 నంబర్ గల లారీ మంగంపేట గుట్టపై నుంచి వేగంగా వస్తుండగా నంద్యాల నుంచి శ్రీసీటికి మొక్క జోన్న పప్పుదినుసులు తీసుకెళ్తున్న ఏపీ04టీయూ8489 నెంబర్ గల లారీ ఢీ కొంది. రెండు లారీల ముందు భాగం దెబ్బతింది. లారీలో సుగ్రీవ్ సింగ్ మృతదేహం ఇరుక్కు పోవడంతో అతి కష్టం మీద బయటకు తీశారు. క్లినర్ జైతూకి చెవి వద్ద గాయం కాగా తిరుపతికి తరలించారు. మరో లారీ డ్రైవర్ పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రం, ధూల్ పూర్, చద్యాన్‌కాపురా గ్రామానికి చెందిన సుగ్రీవ్‌సింగ్ గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్‌ప్రదా కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం వివాహం జరిగింది. భార్య శివానితో రైల్వేకొడూరులో నివాసం ఉంటున్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త చనిపోవడంతో శివానీ, బంధువులు విలపించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వరులు తెలిపారు. -
సంక్రాంతిపల్లిలో ఇళ్ల కూల్చివేత
రాపూరు : కృష్ణపట్నం-ఓబులవారిపల్లి రైల్వేలైను నిర్మాణం కోసం సంక్రాంతిపల్లి ఎస్సీ కాలనీ వద్ద ఇళ్లను మంగళవారం అధికారులు భారీబందోబస్తు మధ్య కూల్చివేశారు. అధికారుల చర్యలను స్థానికులు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. వివరాల్లోకెళితే.. సంక్రాంతిపల్లి పున రావాస ప్రాంతంలో 32 మంది ఎస్సీలకు 1996లో ప్రభుత్వం నివేశన స్థలాలను కేటాయించింది. అక్కడ వాతావరణం సరిగా లేదంటూ లబ్ధిదారులు సమీపంలోని భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. ఇటీవల తమకు కేటాయించిన పట్టాభూముల్లో 46 ఇళ్లు కట్టారు. రైల్వే లైను నిర్మాణానికి ఈ 46 ఇళ్లు అడ్డుగా ఉన్నాయని రైల్వే అధికారులు జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించారు. వీటి తొలగింపు విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ జానకి మంగళవారం స్వయంగా ఈ ప్రాం తాన్ని పరిశీలించారు. ఇటీవల కట్టిన ఇళ్లను కూల్చేయాలని అధికారులను ఆదేశించి వెళ్లిపోయారు. ఆ వెంటనే నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇళ్ల కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. దీనిని నిర్వాసితులు అడ్డుకోవడంతో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్సైలు, 100 మంది పోలీసులను మోహరించారు. తమకు నష్టపరిహారం చెల్లించాకే ఇళ్లు కూల్చుకోవాలని బాధితులు భీక్ష్మించారు. చివరు పోలీసుల సహకారంతో ఇళ్లను తొలగించారు. ఎవరూ లేని సమయంలో తమ ఇళ్లు కూల్చివేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కట్టుకుంటున్నప్పుడు పట్టించుకోని అధికారులు ఇప్పుడు వచ్చి కూల్చేయడం అన్యాయమన్నారు. ఇళ్లలోని వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయని వాపోయారు. అక్రమ కట్టడాలే: వెంకటేశ్వర్లు ఆర్డీఓ ప్రభుత్వం సర్వే నంబర్6లో గతంలో 32 మంది ఎస్సీలకు పట్టాలు మంజూరు చేసిందని ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ స్థలాలు బాగలేవని పక్కనే అదే సర్వే నం బర్లోని ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకున్నారని, దీంతో పాత పట్టాలను రద్దు చేశామన్నారు. రైల్వేలైను వస్తుం దని మళ్లీ ఆ స్థలాల్లో ఇళ్లు కట్టారని, ఖాళీ చేయమని పలుమార్లు సూచించినా వినకపోవడంతో కలెక్టర్ స్వయంగా పరిశీలించి అక్రమ కట్టడాలని నిర్ధారించారని చెప్పారు. ఆయన వెంట తహశీల్దార్ నిర్మలానందబాబా, సీఐలు ర త్నయ్య, సుబ్బారావు, శ్రీనివాసులు, ఎస్సైలు ఉన్నారు. -
డెంగ్యూతో చిన్నారి మృతి
ఓబులవారిపల్లి (వైఎస్సార్ జిల్లా) : డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృత్యువాతపడింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలం పున్నాటివారిపల్లె గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మనీశ్వరి(5) అనే బాలిక డెంగ్యూతో బాధపడుతూ మృతిచెందింది. -
ఎస్ఐ ఆత్మహత్య: పీఎస్ ఎదుట బంధువుల ధర్నా
నిన్న సాయంత్రం రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్న ఓబులువారిపల్లె ఎస్.ఐ నంద్యాల సురేష్‌కుమార్ రెడ్డి అత్మహత్యకు రైల్వే కోడూరు సీఐ రమాకాంత్ వేధింపులే కారణమని అయన భార్య, బంధువులు ఆరోపించారు. మంగళవారం ఉదయం ఓబులువారిపల్లె పోలీసు స్టేషన్ ఎదుట సురేష్ భార్య, బంధువులు ధర్నా చేశారు. సీఐ రమాకాంత్ వచ్చి వివరణ ఇచ్చేవరకు సురేష్ మృతదేహన్ని అంగుళం కూడా కదిలించమని వారు భీష్మించుకుని కూర్చొన్నారు. ఉన్నతాధికారులు రమాకాంత్‌కు కొమ్ముకాస్తున్నారని సురేష్ కుమార్ రెడ్డి భార్య,బంధువులు ఈ సందర్బంగా ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఓబులువారిపల్లె ఎస్.ఐ. నంద్యాల సురేష్ కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం పోలీసు క్వార్టర్స్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ఎస్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆత్మహత్య
కడప: వైఎస్ఆర్ జిల్లా ఓబులవారిపల్లి ఎస్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్వార్టర్స్‌లోనే అతను రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి కారణాలు తెలియలేదు. -
వరుస హత్యలకు పాల్పడ్డ సైకో అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం
వైఎస్సార్ జిల్లా: ఓబులవారిపల్లి మండలం జీవీపురం గ్రామంలో కలకలం సృష్టించి వరుస హత్యలకు పాల్పడిన సైకో వెంటకరమణ అనే ఉన్మాదిని ఎట్టకేలకూ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఈ ఉన్మాది తుపాకి తీసుకుని కాలుస్తూ గందరగోళం సృష్టించి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నాడు. అతడు జరిపిన కాల్పులలో తోట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పైగా ఆ ఉన్మాది పొలం తగాదాలో తన తండ్రిని కొట్టి చంపారని వెంకటరమణ చెప్పేవాడు. గతంలో ఒక వ్యక్తిని కాల్చిచంపడం, మరోవ్యక్తిని కత్తితో నరికి చంపినట్లు ఆరోపణలున్నాయి. తోట సుబ్రహ్మణ్యం ప్రాణాలకు కూడా ముప్పు ఉండటంతో అతడికి గతంలో గన్‌మన్ రక్షణ కూడా కల్పించారు. కానీ ఇటీవలి కాలంలో ఆ భద్రత ఉపసంహరించడంతో పొలం వద్దకు వెళ్లి మరీ తుపాకితో కాల్చిచంపాడని అంటున్నారు.