
గ్రామ వాలంటీర్ హేమంత్
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని గ్రామ వాలంటీర్ హేమంత్‌రెడ్డి అన్నారు. తమ రియల్ హీరో సీఎం జగనేనని, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. కరోనా సంక్షోభంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటూ కొనియాడారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సు ప్రారంభమైంది.ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు తమ అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు.
అప్పుడు కించపరిచారు.. ఇప్పుడు మా సేవలను గుర్తించారు
వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు కించపరిచారని, ఇప్పుడు వాలంటీర్ల సేవలను అందరూ గుర్తించారని గ్రామ వాలంటీర్ యెల్లతూరి స్మైలీ అన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలను కొనసాగిస్తూ సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. అవినీతి రహితంగా తాము సేవలు అందిస్తున్నామని, జగనన్న వారియర్స్‌గా కొనసాగుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’
మీ నుంచి వచ్చిన గొప్ప ఆలోచన: నాగలక్ష్మీ
‘గ్రామ వాలంటీర్ వ్యవస్థ.. మీ నుంచి వచ్చిన గొప్ప ఆలోచన’ అని గ్రామవాలంటీర్ నాగలక్ష్మీ అన్నారు. ‘ఏ సమస్య ఉన్నా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిష్కరించవచ్చు. గ్రామ వాలంటీర్ వ్యవస్థకు మంచి తోడ్పాటు అందించారు. ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ మేం చాలా సహాయం చేస్తున్నాం. కరోనా విపత్కర కాలంలోనూ మేం భయపడలేదు. ప్రజల కోసం పనిచేస్తున్నామని ధైర్యంగా ఉన్నాం. మీరు మాకు రూ.50 లక్షల ప్రమాద భీమా కల్పించి అండగా ఉన్నారు’ అని తెలిపింది.
నేతన్న కష్టాలు తీర్చారు: ఫర్జానా
పాదయాత్రలో నేతన్న కష్టాలు గమనించి ఇప్పుడు మీరు అండగా ఉన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 81 వేల మంది నేతన్నలకు రూ. 24 వేల పెట్టుబడి సాయం అందించడం ద్వారా మమ్మల్ని ఆదుకున్నారంటూ ఫర్జానా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment