
పుత్తా ప్రతాప్ రెడ్డి అర్థ నగ్నంగా నిరసన
హైదరాబాద్ : సమన్యాయం చేయాలంటూ దీక్షకు దిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు చంచల్‌గూడ జైలు వద్దకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కాంగ్రెస్, సీబీఐ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావటంతో చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.
ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ముళ్లకంచెలను సైతం లెక్కచేయకుండా అభిమానులు చంచల్‌గూడ వద్దకు చేరుకుంటున్నారు. దాంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి అర్థ నగ్నంగా నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసున్నారు. అలాగే ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.