Putta Pratap reddy
-
వైఎస్‌కు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం, పంజగుట్ట సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమాల్లో పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలకు నగదు, నోటు పుస్తకాలు అందజేశారు. సాక్షి ప్రధాన కార్యాలయంలోనూ వైఎస్సార్‌కు నివాళులర్పించారు. -
వైఎస్సార్సీపీ యూత్ కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి... ఎల్.రవీందర్ -కరీంనగర్ : ఎన్.శాంతి కుమార్, టి.చెన్నారెడ్డి-వరంగల్: ఎం.ఎ.ముజీబ్, కె.హనుమంతరావు, పి.రాము, చిలుకా ఉపేంద్రరెడ్డి, తిరుపతి రెడ్డి, కె.దయానంద్ గౌడ్ - రంగారెడ్డి: శ్రీనివాసరెడ్డి, ఎడ్మ సత్యం- మహబూబ్‌నగర్: ఎం.విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఏజీ నర్సింహయాదవ్- మెదక్ ఉన్నారు. -
వైఎస్సార్సీపీ యువజన విభాగంలోకి కొత్త రక్తం
రాష్ట్ర కమిటీ సభ్యులుగా 68 మంది నియామకం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొత్తగా 68 మంది నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలంగాణ, కోస్తా, రాయలసీమ.. మూడు ప్రాంతాలకు చెందిన వారిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ విషయాన్ని పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
పుత్తా ప్రతాప్ రెడ్డి అర్థ నగ్నంగా నిరసన
-
పుత్తా ప్రతాప్ రెడ్డి అర్థ నగ్నంగా నిరసన
హైదరాబాద్ : సమన్యాయం చేయాలంటూ దీక్షకు దిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు చంచల్‌గూడ జైలు వద్దకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కాంగ్రెస్, సీబీఐ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావటంతో చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ముళ్లకంచెలను సైతం లెక్కచేయకుండా అభిమానులు చంచల్‌గూడ వద్దకు చేరుకుంటున్నారు. దాంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి అర్థ నగ్నంగా నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసున్నారు. అలాగే ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
చంచల్‌గూడ వద్ద పుత్తా ప్రతాప్‌రెడ్డి అరెస్ట్
-
చంచల్‌గూడ వద్ద పుత్తా ప్రతాప్‌రెడ్డి అరెస్ట్
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదంటూ ఆయనను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పోలీసు చర్యలను పార్టీ శ్రేణులను అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్తతలకు దారి తీసింది. దాంతో పుత్తా ప్రతాప్ రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, ముక్కా రూపానందరెడ్డిల సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు మరో 400 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపేందుకు పార్టీశ్రేణులు, అభిమానులు చంచల్‌గూడకు చేరుకుంటున్నారు. జగన్‌కు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొందరు మహిళలు మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీబీఐ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా జగన్‌ను కలిసేందుకు చంచల్‌గూడ జైలు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డికి ములాఖత్‌కు అనుమతి లేదంటూ జైలు అధికారులు నిరాకరించారు.