
వైఎస్‌కు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం, పంజగుట్ట సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమాల్లో పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలకు నగదు, నోటు పుస్తకాలు అందజేశారు. సాక్షి ప్రధాన కార్యాలయంలోనూ వైఎస్సార్‌కు నివాళులర్పించారు.