రాహుల్‌గాంధీని పీఎం చేసేందుకే విభజన
Published Tue, Aug 6 2013 4:13 AM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM
యువనేత రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే రాష్ట్రాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాంగాంధీ విభజించారని ఏపీ ఎన్‌జీఓ జేఏసీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సోమవారం కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఎన్‌జీఓ జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఎన్‌జీఓ జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నాయకులు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. పదవుల కోసం సీమాంధ్ర నాయకులు సోనియా గాంధీకి అమ్ముడు పోయారని ఆరోపించారు.
Advertisement
Advertisement