దక్షిణ మధ్య రైల్వేలో మోగనున్నసమ్మె సైరన్! | railway employee's to strike! | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య రైల్వేలో మోగనున్నసమ్మె సైరన్!

Published Mon, Dec 23 2013 5:10 PM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

railway employee's to strike!

హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలో సమ్మె సైరన్ మోగనుంది. డిమాండ్ల సాధనకు రైల్వే కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మెకు భారీ స్థాయిలో రైల్వే ఉద్యోగులు మద్దతు తెలపడంతో సమ్మె అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి స్ట్రైక్ బ్యాలెట్ ఫలితాలను మజ్దూర్ యూనియన్ సోమవారం ప్రకటించింది. 68, 640 మంది ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొనగా, 68,190 మంది ఉద్యోగులు సమ్మెకు మద్దతు తెలిపారు. దీనిపై వచ్చే నెల 15, 16, 17 తేదీల్లో సమావేశమై సమ్మె తేదీలను ప్రకటిస్తామని యూనియన్ ప్రదాన కార్యదర్శి శంకర్ రావు తెలిపారు.

 

ఇందులో భాగంగా కార్మికుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్‌లలో స్ట్రైక్ బ్యాలెట్ నిర్వహించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 వేల మంది ఇందులో పాల్గొననున్నారు.  సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, గుంతకల్, తిరుపతి లాంటి ముఖ్య స్టేషన్‌లలో వేలాదిగా కార్మికులు పాల్గొన్నారు. దీనిలో వ్యక్తమైన అభిప్రాయంపై చర్చించి సమ్మెపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ద.మ. రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకరరావు  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement