'అబద్ధాలతోనే వంద రోజుల పాలన' | Rajanna dora takes on tdp leaders | Sakshi
Sakshi News home page

'అబద్ధాలతోనే వంద రోజుల పాలన'

Published Tue, Sep 16 2014 2:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

'అబద్ధాలతోనే వంద రోజుల పాలన'

'అబద్ధాలతోనే వంద రోజుల పాలన'

విజయనగరం: అబద్ధాలు చెబుతూనే చంద్రబాబు 100 రోజులూ పాలన సాగించారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.రాజన్నదొర ఆరోపించారు. ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ప్రమాణస్వీకారం రోజున చంద్రబాబు 5 సంతకాలు చేసిన పథకాలు నేటికి కూడా అమలు కావడం లేదని తెలిపారు.

రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పంట రుణాల మాఫీ విషయంలో రైతులను టీడీపీ నాయకులు గందరగోళానికి గురి చేస్తున్నారని రాజన్నదొర మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement