ఖమ్మం గాంధీచౌక్/ ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని విడదీస్తే ఊరుకునేది లేదని జర్నలిస్టుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మయూరిసెంటర్, బస్టాండ్, జడ్పీసెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అక్కడ దీక్ష చేస్తున్న పంచాయతీ రాజ్ ఉద్యోగులకు జర్నలిస్టులు సంఘీభావం ప్రకటించారు.
భద్రాచలాన్ని కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని జర్నలిస్టు నేతలు ప్రకటించారు. భద్రాచలం డివిజన్‌ను పోలవరంతో ముంచేందుకే సీమాంధ్రులు ఆ డివిజన్ కావాలని కోరుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామ్‌నారాయణ, ఏనుగు వెంకటేశ్వరరావు, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎ.ఆదినారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా అసొసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసేన్, వెంకట్రావ్, జర్నలిస్టు నాయకులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాపారావు, కృష్ణమురారి, అప్పారావు, వనం వెంకటేశ్వర్లు, పోటు శ్రీనివాస్, వేణుగోపాల్, నాగేందర్ పాల్గొన్నారు. జర్నలిస్టుల ప్రదర్శనకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు, టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగారాజు, నడింపల్లి వెంకటపతిరాజు సంఘీభావం ప్రకటించారు
భద్రాచలాన్ని విడదీస్తే ఊరుకోం..
Published Tue, Nov 19 2013 5:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement