
గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు
చంద్రబాబు ప్రభుత్వంపై రామచంద్రయ్య ధ్వజం
సాక్షి, అమరావతి: గవర్నర్ నరసింహన్‌తో చంద్రబాబు ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందని శాసనమండలి ప్రతి పక్ష నేత సి రామచంద్రయ్య ధ్వజమెత్తారు. సోమవారం గవర్నర్ ప్రసంగం ఆసాంతం వాస్తవాలకు భిన్నంగా సాగిందని.. ఆయన ధోరణి చూస్తుంటే కాలం వెళ్ల దీస్తున్నట్టుగా ఉందన్నారు. పుష్కరాల్లో 29 మంది చని పోతే బ్రçహ్మాండంగా జరిగాయని చెప్పడాన్ని రామ చంద్రయ్య ఆక్షేపించారు. ఎకనమిక్ సర్వేలో అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా ఏపీ నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
రాజ్యాంగం ప్రకారం ఆర్నెల్ల వ్యవధిలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి కాబట్టి ఈ సమావేశాలు పెట్టినట్టు ఉందన్నారు. అసెంబ్లీ భవనాలు సుందరంగా ఉంటే సరిపోదని, సభలో అర్థవంతమైన చర్చలు జరిగి సమస్యలకు పరిష్కారాలు చూపాలని సూచించారు.