ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: బోగస్ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాలశాఖ రంగం సిద్ధం చేసిం ది. వాటిని నిరోధించేందుకు ఇప్పటి వరకూ శతవిధాలా ప్రయత్నించినా అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఆఖరి అస్త్రంగా ఈ - రేషన్‌ను తెరపైకి తెచ్చింది. ఈ విధానంతో బోగస్ కార్డులకు బ్రేక్ వేయడంతో పాటు కోట్లాది రూపాయల నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా చెక్ పెట్టేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగా రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
నిర్ణీత గడువులోగా ఆధార్ ప్రక్రియ పూర్తయితే ఆ తరువాత నెల నుంచి నిత్యావసరాల కేటాయింపులు ఆ శాఖ కమిషనరేట్ చేయనుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాస్తవ కార్డుదారుడికి నిత్యావసరాలు పూర్తిస్థాయిలో అందనున్నాయి. జిల్లాలో 2107 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 9 లక్షల 10 వేల 693 రేషన్ కార్డులున్నాయి. అందులో 8 లక్షల 563 తెల్లకార్డులు, 56 వేల 946 మూడో విడత రచ్చబండ కార్డులు, 52 వేల 152 అంత్యోదయ, అన్న యోజన కార్డులు, 1032 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఈ కార్డులకు సంబంధించి ప్రతినెలా 10089.343 టన్నుల పీడీఎస్ బియ్యం, 1825.355 టన్నుల అంత్యోదయ, అన్నయోజన కార్డుల బియ్యం, 10.340 టన్నులు అన్నపూర్ణ కార్డుల బియ్యం కేటాయిస్తున్నారు. 426.329 టన్నుల పంచదార, 60.000 టన్నుల గోధుమలు, 8 లక్షల 53 వేల 52 లీటర్ల కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి అమ్మహస్తం పేరుతో తొమ్మిది రకాల నిత్యావసరాలను ప్రభుత్వం అందిస్తోంది.
‘ఈ-రేషన్’తో అక్రమాలకు చెక్
Published Thu, Jan 9 2014 5:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement