సాతులూరు ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి, కృష్ణదేవరాయలు, విడదల రజని
పట్నంబజారు(గుంటూరు) నవరత్నాలతోనే ప్రతి ఇంటా భవిష్యత్... వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ద్వారానే ప్రతి ఒక్కరికీ మంచి జరుగుతుంది.. పచ్చచొక్కా వేసుకున్న వారికి కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుంది.. సంక్షేమం మాదరి చేరుతోంది.. అంటూ జిల్లా ప్రజలు వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట చెబుతున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో బుధవారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లిన నేతలకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు. వారి సమస్యలు చెప్పుకుంటూ నాలుగున్నర ఏళ్లల్లో పడిన కష్టాలు తెలియజేస్తున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో మా ప్రాంతాలు కునారిల్లుతున్నాయంటూ అందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రతినబూనుతున్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 45వ డివిజన్ వల్లూరువారితోట, శ్రీనగర్ ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులకు నవరత్నాల ఆవశ్యకతను తెలిపా రు. పారిశుద్ధ్యం, సైడు కాల్వలు అధ్వాన్నంగా ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా, అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పట్టణంలోని 9వ వార్డులో రావాలి జగన్ – కావాలి జగన్ నిర్వహిం చారు. స్థానికులు చెబుతున్న సమస్యలను సా వధానంగా ఆలకిస్తూ త్వరలోనే మంచి రోజు లు వస్తాయని భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. 2019లో వైఎస్సార్‌సీపీని, వై.ఎస్. జగన్‌ను ఆశీర్వదించాలని ఆర్కే ప్రజలను కోరారు.
తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణంలో సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ రావాలి జగన్ – కావాలి జగన్‌ను చేపట్టారు. ఆ రో వార్డు లోని ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ప్రతి ఇంటికి నవరత్నాల ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వ నాలుగున్నరేళ్ల అసమర్ధ పాలనను ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల పట్టణంలో నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి రావాలి జగన్ – కావాలి జగన్‌ను నిర్వహించారు. పట్టణ పార్టీ నేతలు, యువకులు పెద్ద ఎత్తున ఎదురేగి కాసుకు ఘన స్వా గ తం పలికారు. పట్టణంలోని ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ వారి ఇబ్బందులను ఆలకిస్తూ పరిష్కరించేందుకు పాటుపడతామని భరోసా ఇచ్చారు.
చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని చేపట్టిన రావాలి జగన్ – కావాలి జగన కార్యక్రమానికి నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి ఇంట నవరత్నాలు సిరులు పండిస్తాయని, పేదవాడి భవిష్యత్‌కు ఆసరగా నిలుస్తాయని తెలియజెప్పారు. కరపత్రాల ద్వారా నవరత్నాల పథకాలను పరిపూర్ణంగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment