గ్రావెల్ రవాణాలో ఆర్డీఓ దొంగాట
వవ్వేరు నుంచిగ్రావెల్ రవాణాకు గ్రీన్‌సిగ్నల్
భగ్గుమంటున్న ప్రజలు, నేతలు
బుచ్చిరెడ్డిపాళెం: గ్రావెల్ అక్రమ రవాణాలో నెల్లూరు ఆర్డీఓ దొంగాటాడుతున్నారు. మండలంలో గ్రావెల్ రవాణాను నిలిపేయాలని చెప్పిన ఆర్డీఓ గురువారం రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకున్న రెవెన్యూ అధికారులకు వదిలేయాల్సిందిగా సూచించారు. ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర నాయకురాలిని బీజేపీ నాయకులకే సమస్య వచ్చిందా అంటూ ఆర్డీఓ మాట్లాడటం గమనార్హం. మైనింగ్‌కు సంబంధం లేకుండా అనుమతి ఇవ్వడంలో ఆర్డీఓ ప్రత్యేక శ్ర ద్ధ ఏమిటని బీజేపీ నాయకురాలు ప్రశ్నిస్తున్న వైనంపై సాక్షి కథనం. మండలంలోని వవ్వేరు, పెనుబల్లి, రామచంద్రాపు రం నుంచి గ్రావెల్ అక్రమ రవాణా జరగడంపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి కలెక్టర్ స్థాయి వరకు అర్జీలు వెళ్లాయి. ఈ క్రమంలో గ్రావెల్ రవాణా ఆగింది. అయితే ఇటీవల పది రోజుల నుంచి జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాను బుధవారం నిలిపేశారు. ఆర్డీఓ ఆపేయమన్నారని, మండలంలో ఎక్కడా గ్రావెల్ రవాణా జరగదని తెలిపారు. వవ్వేరులో జరుగుతున్న గ్రావెల్ రవాణాను కూడా బుధవారం ఆర్‌ఐ ఆపారు.
రాత్రికి రాత్రే మార్పు..
వవ్వేరులో గురువారం ఉదయం నుంచి గ్రావెల్ రవాణా జరుగుతోంది. దీనిపై సమాచారం అందుకున్న వీఆర్‌ఓ, తలారి వెళ్లి ఆపారు. అక్కడి నుంచి అక్రమార్కులు నేరుగా ఆర్డీఓకు ఫోన్ చేశారు. దీంతో పట్టుకున్న వాహనాలను వదిలేయాల్సిందిగా ఆర్డీఓ వీఆర్‌ఓకు సూచించారు. మండలంలో జరుగుతున్న ఎఫ్డీఆర్ పనులకు సంబంధించి గ్రావెల్‌కు అనుమతి ఇచ్చానని చెప్తున్న ఆర్డీఓ తనకు ఇచ్చే అధికారం లేదన్న విషయాన్ని మరిచారు. టీడీపీ నేతలకు దాసోహంగా మారి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. వాస్తవానికి గ్రావెల్ రవాణాకు మైనింగ్ అనుమతివ్వాల్సి ఉంది.
ఒకవేళ ఎఫ్డీఆర్ పనులకు సంబంధించి సంబంధిత అధికారి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే, అందుకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి. కలెక్టర్ అనుమతి లేకుండా గ్రావెల్ రవాణా చేయడం చట్ట విరుద్ధం. అయితే నిబంధనలను ఉల్లంఘించి ఆర్డీఓ అనుమతి ఇవ్వడం, ఆపేయడం, మళ్లీ రవాణా చేసుకోమని చెప్పడంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వాదాయానికి గండి
మైనింగ్ శాఖ అనుమతి లేకుం డా జరుగుతున్న గ్రావెల్ రవాణాతో ప్రభుత్వాదాయానికి గం డిపడింది. సీనరేజ్ కట్ చేస్తారని, ప్రభుత్వ పనులే కాబట్టి అనుమతిచ్చామని చెప్తున్న ఆర్డీ ఓ, ఆయా పనుల్లో గ్రావెల్‌ను తరలించినందుకు కాంట్రాక్టర్‌కు నిధులు చెల్లిస్తున్న విషయా న్ని మరిచ్చారు. ఈ విషయమై ఆర్డీఓ వివరణ కోరేందుకు సాక్షి యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.