రూ.4 కోట్ల ‘ఎర్ర’ దుంగలు స్వాధీనం
Published Thu, Mar 9 2017 9:27 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
మైదుకూరు(వైఎస్సార్‌జిల్లా): తమిళనాడు కూలీలు చావుకు భయపడటం లేదు. 2015 సంవత్సరం ఫిబ్రవరిలో ప్రభత్వం ఎర్ర చెందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న దాదాపు 20మంది కూలీలను ఎన్‌కౌటర్ చేసి చంపినా తమిళ కూలీలకు ఎర్ర చందనం మీద వాటి నుంచి వచ్చే ఆదాయం మీద మనసు చావడం లేదు.
ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా వారు ఎర్ర దుంగల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. గురువారం తెల్లవారుజామున మండలంలోని వనిపెంట అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించింది. అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 15 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4 కోట్ల విలువైన 300 ఎర్రచందనం దుంగలతో పాటు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో మరింత మంది తమిళ కూలీలు ఉన్నట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి కోసం తనిఖీలు చేపడుతున్నారు.
Advertisement
Advertisement