ప్రజలు ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారు | Reddi Santi fire on tdp govt | Sakshi
Sakshi News home page

ప్రజలు ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారు

Published Wed, Jul 13 2016 11:42 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Reddi Santi fire on tdp govt

శ్రీకాకుళం అర్బన్: హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలంతా చంద్రబాబును, టీడీపీ ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పా ర్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
 
 చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించేందుకే ఈ గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి టీడీపీ ఇచ్చిన హమీల్లో ఏఒక్కటైనా అమలు చేశారా అంటూ కరపత్రం ఇస్తూ అడగడంతో ప్రజలంతా వారి ఆవేదననను వ్య క్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమానికి ప్ర జల నుంచి అపూర్వ స్పం దన లభిస్తోందన్నారు.
 
 వి భజనానంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటే దాన్ని చంద్రబాబు, మంత్రులు కాజేస్తున్నారు త ప్ప వాటితో ఒక్క అభివృద్ధి పధకమూ చేపట్టలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలిసినా ఎవరూ స్పందించడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement