Reddi Santi
-
‘అసమర్థ పాలన కప్పిపుచ్చుకునేందుకే గిమ్మిక్కులు
శ్రీకాకుళం సిటీ: ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాలీలు నిర్వహించడం తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి శాంతి పేర్కొన్నారు. మంగళవా రం ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశా రు. నాలుగేళ్ల పాలనలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాలపై మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలి పారు. అయినా ఏ ఒక్కరోజూ ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, అధికారులపై దౌర్జన్యాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ నేరపూరిత నిర్లక్ష్యాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎండగడుతున్నారని తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీకి చెందిన న లుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు అఫిడవిట్లు ఆధారంగా ఏడీఆర్(జాతీయ ఎన్నికల పరి శీలన స్వచ్ఛంద సంస్థ) నివేదిక ఇచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 45 మంది ఎమ్మెల్యేల్లో రాష్ట్రానికి చెందిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండడం వారికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ వారిని రక్షించుకునేందుకు సీఎం దొడ్డిదారిన జీఓలు విడుదల చేశారని ఆరోపించా రు. ఈ గిమ్మిక్కులను ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన విదంగా చంద్రబా బుకు బుద్ధి చెబుతారని తెలిపారు. -
కమీషన్లకే నిధుల మంజూరు
ఎల్.ఎన్.పేట: రాష్ట్రంలో సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే నిధులు మంజూరు చేయించడం, రైతుల భూమలు బలవంతంగా లాక్కోవడం, ఆర్థిక నేరాలు(స్కాం), మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటి ఘటనల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. స్థానిక మండల కేంద్రంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయల్లో సగం నిధులు రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. ఆ సొమ్ముతోనే ప్రతిపక్ష పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు దుయ్యబట్టారు. కమీషన్లు ఇచ్చిన పనులకే నిధులు మంజూరు చేస్తున్నారని, ఇందుకు నిదర్శనమే వంశధార రిజర్వాయర్ నిర్మాణమని తెలిపారు. అందుకే నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నా స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే వెంకటరమణ పట్టించుకోవడం లేదని తూర్పారబట్టారు. అవసరం లేకపోయినా రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాలు బలవంతంగా సేకరించారని మండిపడ్డారు. అడ్డుకున్న వారినే తప్పుబట్టారు అమరావతి ప్రాంతంలో మంత్రి లోకేష్ తోపాటు పలువురు మంత్రులు, కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు వందలాది ఎకరాలను బినామీల పేర్లతో దక్కించుకుని వేలాది కోట్లు వెనకేసుకున్నారని రెడ్డి శాంతి నిప్పులు చెరిగారు. అగ్రిగోల్డ్ సంస్థ భూములు కూడా అక్రమించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు ఎప్పుడూ లేనంతగా ఏపీలో పెరిగి పోయాయని, అనేక సర్వేలు స్పష్టమైందన్నారు. ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్న తహసీల్దారు వనజాక్షినే తప్పుపట్టిన ఘనచరిత్ర ఆధికార పార్టీకి చెందుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కన్వీనర్ కిలారి త్రినా«థరావు, నాయకులు పెనుమజ్జి విష్ణుమూర్తి, లోచర్ల మల్లేశ్వరరావు, మహంతి రవికుమార్, కొల్ల కృష్ణ, పైల తవిటినాయడు, సవర లకాయ్ పాల్గొన్నారు. -
ప్రజలు ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారు
శ్రీకాకుళం అర్బన్: హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలంతా చంద్రబాబును, టీడీపీ ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పా ర్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించేందుకే ఈ గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి టీడీపీ ఇచ్చిన హమీల్లో ఏఒక్కటైనా అమలు చేశారా అంటూ కరపత్రం ఇస్తూ అడగడంతో ప్రజలంతా వారి ఆవేదననను వ్య క్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమానికి ప్ర జల నుంచి అపూర్వ స్పం దన లభిస్తోందన్నారు. వి భజనానంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటే దాన్ని చంద్రబాబు, మంత్రులు కాజేస్తున్నారు త ప్ప వాటితో ఒక్క అభివృద్ధి పధకమూ చేపట్టలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలిసినా ఎవరూ స్పందించడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
అధికారుల నెత్తిన దీక్షాభారం
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. ఇచ్చిన హామీలను ఏ కారణం చేత అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీసు స్టేషన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బుధవారం ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ‘బాబు’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతిథులకు స్నాక్స్... హాజరై న వారికి భోజనాలు... వేదిక నిర్వహణ ఖర్చులు కలిపి సుమారు ఏడు లక్షల రూపాయలు! ఇది ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గంలో లెక్క తేలిన ఖర్చు. ఈ భారం భరించింది ప్రభుత్వమో, మంత్రులో కాదు! అదంతా రెవెన్యూ, నగరపాలక సంస్థ, మెప్మా, ఇతర శాఖల అధికారులు. ఇలా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ సుమారు రెండు లక్షల రూపాయలు చొప్పున చేతిచమురు వదిలినట్లు అధికారుల మాటలను బట్టి తెలుస్తోంది. ఇదీ ఈ నెల రెండో తేదీ నుంచి బుధవారం వరకూ జరిగిన నవనిర్మాణ దీక్షల ఫలితం! అన్ని నియోజకవర్గాల్లోనూ వారం రోజుల పాటు దీక్షలు, రోజుకో అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పిన ప్రభుత్వం... అందుకోసం అయ్యే ఖర్చుల కోసం పైసా కూడా విదల్చలేదు. దీంతో తమ జేబులకు పడిన చిల్లులను ఎలా పూడ్చుకోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడిచిపోయింది. ఈ విభజనతో జరిగిన నష్టాలపై నవనిర్మాణ దీక్ష కార్యక్రమం పేరుతో రోజుకొక అంశాలన్ని తీసుకొని చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ రెండేళ్లలో జిల్లాలో ఎలాంటి ప్రగతి కనిపించకపోయినా పాత హామీలన్నీ నెరవేర్చాశామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మస్తుతికి, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై పరనింద వేయడానికి పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రజ లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపలే దు. దీంతో అధికారుల ఒత్తిడి మేరకు చిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి వర్కర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బందే విధిలేని పరిస్థితుల్లో హాజరయ్యారు. మంత్రులు హాజరైన సభలకు మాత్రం టీడీపీ కార్యకర్తల హడావుడి కనిపించింది. అఖరి రోజు అట్టర్‌ఫ్లాప్! నవనిర్మాణ దీక్షల్లో చివరి రోజైన మహాసంకల్ప దీక్షకు ప్రజాదరణ కరువైంది. జిల్లా కేంద్రంలోని కోడి రామమూర్తి స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీకాకుళంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలను బస్సులు పెట్టి మరీ తరలించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం ప్రారంభించే సమయానికి ఒక్కొక్కరు సభ నుంచి లేచివెళ్లిపోవడం మొదలైంది. ఆ తర్వాత 5 గంటకు తెరపై ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభించే సమయానికి అది మరింత ఎక్కువైంది. సభలో ప్రజలు కనిపించకపోయేసరికి కంగారుపడిన అధికారులు వారిని ఆపాలని పోలీసులకు సూచించారు. వారు ప్రధాన గేట్లను మూసేశారు. అయినా చాలామంది గోడలు దూకి వెళ్లిపోయారు. కష్టమే మిగిలింది ఎంతకష్టపడిన ఫలితం దక్కలేదని పలువురు అధికారులు వాపోతున్నారు. శ్రీకాకుళం రూరల్, గార మండలాల నుంచి పదేసి బస్సుల్లో మహిళలను తరలించారు. అలాగే శ్రీకాకుళం నగరం నుంచి డ్వాక్రా మహిళలను తీసుకురావడానికి మెప్మా, నగరపాలక సంస్థ అధికారులు అష్టకష్టాలు పడ్డారు. ఏది ఏమైనా చివరిరోజు మహాసంకల్పదీక్షను విజయవంతం చేయాలని దాదాపుగా రూ.5 లక్షల వరకూ ఖర్చు చేశారు. తీరా సీఎం ప్రసంగం మొదలయ్యే సమయానికి వేదిక వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులే మిగలడం కొసమెరుపు. భారం ఎవ్వరిది ఏడు రోజుల పాటు జిల్లా కేంద్రంతో పాటు పది నియోజకవర్గాల్లో నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం కార్యక్రమాలకు అయ్యే ఖర్చును పూర్తిగా అధికారులే భరించారు. వేదిక వద్ద షామియానాలు, కుర్చీలు, మెక్‌లు, లైటింగ్ వగైరా ఖర్చుతో పాటు అతిథులకు స్నాక్స్, హాజరైనవారికి భోజనాలు ఇలా జిల్లా మొత్తం మీద రూ.25 లక్షల వరకూ ఖర్చు అయ్యిందని అధికారుల అంచనా. అయితే ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరుకాలేదు. దీంతో ఈ భారం ఎవ్వరిపై వేయాలనే విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.