రెగ్యులర్ ఎంఈఓలు ముగ్గురే.. | Regular river valley, three .. | Sakshi
Sakshi News home page

రెగ్యులర్ ఎంఈఓలు ముగ్గురే..

Published Mon, Dec 9 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

Regular river valley, three ..

=48 మండలాల్లో ఇన్‌చార్జ్ ఎంఈఓలే దిక్కు
 =మొక్కుబడిగా పాఠశాలల పర్యవేక్షణ

 
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : జిల్లాలో రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటుంద నే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ ఎంఈఓలు ము గ్గురే ఉన్నారు. రెగ్యులర్ ఎంఈఓలు క్రమక్రమంగా ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఆ స్థానాల్లో రెగ్యులర్ వారిని నియమించడం లేదు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ విషయం కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఎంఈఓలనునియమించడం లేదు. హన్మకొండ మండలానికి డి.వీరభద్రనాయక్, నల్లబెల్లికి ఎం.దేవా, వరంగల్‌కు ప్రభాకర్‌రాజు మా త్రమే రెగ్యులర్ మండల విద్యాశాఖాధికారులుగా పనిచేస్తున్నారు.

వీరు కూడా త్వరలోనే ఉద్యోగ విరమణ చేయనున్నారు. మి గతా 48 మంది మండలాలకు ఇన్‌చార్జ్ ఎంఈఓలే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈఓలు ఉద్యోగ విరమణ పొం దిన ఖాళీ స్థానాల్లో ఆయా మండలాల్లోని సీనియర్ పీజీహెచ్‌ఎంలను ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా నియమిస్తున్నారు. కొన్ని మండలాల్లో ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు. తరచు ఇన్‌చార్జ్ ఎంఈఓలు మారుతున్నారు. నాలుగు రోజుల క్రితమే దుగ్గొండి మండలానికి తొగర్రాయి జెడ్పీఎస్‌ఎస్ పీజీ హెచ్‌ఎం పి.రత్నం, రాయపర్తి మండలానికి ఇన్‌చార్జ్ ఎంఈఓగా కేశవపూర్ జె డ్పీఎస్ ఎస్ పీజీ హెచ్‌ఎం జయసాగర్‌ను నియమిస్తూ డీఈఓ ఎస్.విజయకుమార్ ఆదేశాలు జారీచేశారు.
 
ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా కొనసాగుతున్న మండలాల్లో పాఠశాలల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉంటుందనే ఆరోపణలున్నాయి. కొందరు ఎంఈఓలు వారు పనిచేసే ైెహ స్కూళ్లకు అప్పుడప్పుడు మాత్రమే హాజరవుతున్నారు. దీంతో ఆయా ైెహ స్కూళ్లలో విద్యాబోధనపై పర్యవేక్షణ కొరవడుతోంది. మరోవైపు వివిధ సమావేశాలు, శిక్షణ, వీడియోకాన్ఫరెన్స్ పేరుతో ఎంఈఓలను జిల్లా కేంద్రానికి వస్తున్నారు.

అత్యవసర సమావేశాలు, వివిధ కారణాలతో తమపై ఒత్తిడి పడుతుందని ఎంఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా ఏదోఒక సమాచారం పంపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఎంఈఓలు పాఠశాలలను నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. విద్యార్థులకు విద్యాబోధన సరిగా అందుతుందా, వారికి రాయడం, చదవడం వస్తుందా, మధ్యాహ్న భోజనం సక్రమంగా అందిస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సి ఉంటుంది.

కొందరు ఎంఈఓలు అకడమిక్ పరంగా, మరికొందరు మొక్కుబడిగానే పరిశీలనచేస్తున్నార నే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా ఉండడం వలన కూడా ఈ పరిస్థితి వస్తోంది. మరోవైపు కొందరు ఎంఈఓలపై అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆర్‌వీఎం జిల్లా ప్రాజెక్టు అధికారులు విచారణ నిమిత్తం సీఆర్పీలను పాఠశాలలకు పంపుతున్నారు. వారు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు ఉండటంలేదు. డీఈఓగా ఎస్.విజయకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువగా పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు.

విద్యార్థులకు సరిగా చదవడం, రాయడం రావడం లేదని హసన్‌పర్తి మండలంలో పలువురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన విషయం విదితమే. డీఈఓ ప్రతిరోజూ ఒకటి రెండు పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన అమలును కూడా పర్యవేక్షిస్తున్నారు. తనిఖీ చేసిన పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటున్నట్లు గుర్తిస్తున్నారు. జిల్లాలో 3వేలకుపైగా పాఠశాలలను తనిఖీ చేయడం డీఈఓకు సాధ్యం కాదు.
 
ప్రతి మండలంలో పాఠశాలలను ఎంఈఓలే పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ, అలా చేయడం లేదు. పాఠశాలలకు మంజూరవుతున్న నిధులను సరిగా వినియోగిస్తున్నారా లేదా అనేది కూడా పట్టించుకోవడం లేదు. మధ్యాహ్న భోజనం పథ కం అమలుపై ఆక్విటెన్సీలను ఎంఈఓలు సరిగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపడం లేదు. కొందరు ఎంఈఓలు వం టచేసిపెట్టే ఏజెన్సీలకు వెంటనే బిల్లులు ఇవ్వడంలేదు. కుకింగ్ హెల్పర్లకు సకాలంలో వేతనం చెల్లించడంలేదు. దీనిపైన కూడా ఎంఈఓలకు పలుసార్లు డీఈఓ ఆదేశాలిచ్చారు. అకడమిక్ పరంగా కూడా ప్రతి నెల ఎంఈఓలతో డీఈఓ సమావేశాలను ఏ ర్పాటు చేసి సమీక్షిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈఓలను నియమిస్తేనే పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందడంతో పాటు పర్యవేక్షణ కూడా సులువుగా ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement