
సత్తెనపల్లి: కరోనా మానవత్వాన్ని మింగేస్తోంది. వైరస్ సోకి మరణిస్తే సొంత బంధువులు సైతం వణికిపోతున్న ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఐసోలేషన్‌కు వెళ్లే నిమిత్తం ఇంటివద్ద సిద్ధంగా ఉండాలని గ్రామ వలంటీర్ సూచించాడు. ఈలోగానే ఆస్పత్రిలో చేరాలని సొంత కుటుంబసభ్యులు, బంధువులతో ఆదివారం రోడ్డుపైకి వచ్చిన అతను కుప్పకూలి మరణించాడు. దీంతో భయపడిన బంధువులంతా అక్కడినుంచి పారిపోయారు.
మూడు గంటలకు పైగా మృతదేహం రోడ్డుపైనే ఉండిపోయింది. చివరకు స్థానిక వైఎస్సార్‌సీపీ నేత చల్లంచర్ల సాంబశివరావు స్పందించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment