నిండిపోయిన జలాశయాలు
హైదరాబాద్:రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరడంతో జలాశయాలన్నీ నిండిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నీటిమట్టం 1402.82 అడుగులకు చేరింది. జలాశయంలో ఇన్ ఫ్లో19,631 క్యూసెక్కులుగా ఉంది. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ 8 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 16వేల క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల చేశారు.
నాగార్జునసాగర్‌లో వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట‌్టం పూర్తి స్థాయిలో 590 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో లక్షా 95 వేల 218 క్యూసెక్కులకు చేరుకుంది. అవుట్ ఫ్లో లక్షా 90వేల క్యూసెక్కులుగా ఉంది.
అధికారులు 18 గేట్లు ఎత్తివేశారు.
శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది. ఇన్ ఫ్లో 1,75,851 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,20,467 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 884.8 అడుగులుగా ఉంది.