రెవెన్యూ సిబ్బంది సాయంతో రికార్డుల తారుమారు
భూమి లేకున్నా వెబ్‌ల్యాండ్ ద్వారా ఒన్‌బీ పత్రాలు పొందిన వైనం
లబోదిబోమంటున్న హక్కుదారులు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు
నక్కపల్లి: మండలంలో అమలాపురంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు రెవెన్యూ సిబ్బంది సాయంతో రికార్డులు తారుమారుచేసి వెబ్‌ల్యాండ్‌లో తమపేర్లు నమోదుచేయించుకున్నార ంటూ పలువురు రైతులు ఆరోపించారు. తమ భూములతోపాటు సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని తమపేరిట నమోదు చేసుకున్నారని వారు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, అమలాపురం సర్పంచ్ గోవిందు ఆధ్వర్యంలో సోమవారం డీటీ లక్ష్మీనరసమ్మకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ మాజీ సర్పంచ్ అండదండలతో భూమిలేని కొంతమంది టీడీపీ కార్యకర్తలు వన్‌బీ రిజిస్టర్‌లో ఫొటోలు, పేర్లు అక్రమంగా నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. ఇందుకు బదిలీపై వెళ్లిన ఓ వీఆర్వో సహకరించారని పేర్కొన్నారు. వన్‌బీలో అక్రమంగా నమోదు చేసిన ఫొటోలు, పేర్ల తమ భూములుగా వెబ్‌ల్యాండ్‌లో తమపేరున మార్చుకున్నారని అసలు హక్కుదారులు పెంటకోటనాగరాజు, రోకళ్లశ్రీను, సూర్యారావు,పెంటకోట సోములు,అప్పారావు,నారాయుడు,రమణ,సత్తిబాబాబు, రావి అప్పారావు,వెంకటేశ్వరరావు,చేకూరి సత్యనారాయణరాజు, అప్పలరాజు ఆరోపించారు.
ఎలా మారిందంటే..: సర్వే నంబరు 237/1బి,278/5లలో ఎన్‌సీసీ బ్లూవాటర్‌కు చెందిన 2.27ఎకరాల భూమిని సూరిబాబుపేరున, పెంటకోట సూరిబాబు కుటుంబానికి చెందిన సర్వే నంబరు 229/3ఏ277/4,230/4లో సుమారు 2.80 ఎకరాల భూమిని కనకలక్ష్మి పేరున, చేకూరి సత్యనారాయణరాజు , రావి అప్పారావుకు చెందిన సర్వే నంబరు 227/10226/ 5226/10ఎం,331/3బీల్లో 2.92 ఎకరాల భూమినికూడా కాశీరావుపేరున మార్పు చేశారన్నారు. వీటికి 1706,1707,1708 నంబర్లతో వెబ్‌ల్యాండ్‌లో మార్చి వన్‌బీ నకళ్లు పొందారన్నారు. ఈరైతులెవరికి గ్రామంలో భూములు లేవన్నారు. తమ కు చెందిన భూములను వారి పేరున మార్చి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెందిన సర్వే నంబరు 329/3ఏలో 0.59 ఎకరాలను గరికిన కనక మ్మ,(ఖాతనెం1707) 410/1లో 3 ఎకరాలను చింతకాయల రమణమ్మ(ఖాతానెం1711) సర్వే నంబరు 417/1లో 2.27 ఎకరాలను వంకా రమణమ్మ (ఖాతా నంబరు 1712) సర్వే నంబరు 409/3లో 0.20, 409/2బీలో 0.39(ఖాతా నంబరు1713) వంకారమణమ్మ పేరున వెబ్‌ల్యాండ్, ఒన్‌బి రిజిస్టరులో నమోదు చేశారన్నారు.
నష్టపరిహారం కోసమే: మండలంలో చందనాడ, రాజయ్యపేట, వేంపాడు, ఎన్‌నర్సాపురం, అమలాపురం, నెల్లిపూడి, బోయపాడు, డీఎల్‌ఫురం తదితర గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకోసం ప్రభుత్వం 5వేల ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో అమలాపురం కూడా ఉంది. భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఒకరికి చెందిన భూములను మరొకరిపేరున మార్చి రూ.లక్షల్లో నష్టపరిహారం కాజేసుందుకే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పన్నాగం పన్నారని బాధిత రైతులు ధ్వజమెత్తారు. ఇక్కడి నుంచి బదిలీపై మాడుగుల మండలం వెళ్లిన వీఆర్వో రాజేశ్వరరావు సహకారంతోనే ఈ అక్రమాలు జరిగాయాని వారు ఆరోపించారు. ఇలా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ఇప్పటికే సస్పెన్షన్‌కు సిఫార్సు చేశారు.
విచారణ చేపడతాం: రైతుల ఫిర్యాదు విషయాన్ని తహశీల్దార్ సుందరరావు వద్ద ప్రస్తావించగా విచారణకు చర్యలు తీసుకుంటామన్నారు. వీఆర్వో వల్లే ఇందంతా జరిగి ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవిషయాన్ని సమగ్రంగా విచారించాలని ఆర్‌ఐ అశోక్‌ను ఆదేశించగా ఒన్‌బీలో మార్పులు జరగడం వాస్తవమేనన్నారు. ఫోటోలు అతికించి పేర్లు మార్చారని సర్వేనంబర్ల వద్ద మరొకరి ఫొటోలు,పేర్లు అతికించారన్నారు. మార్పుచేసిన చోట తహశీల్దార్, ఆర్‌ఐ సంతకాలు లేవన్నారు. విచారణ జరిపి పూర్తినివేదిక అందజేస్తామన్నారు. ప్రభుత్వభూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదుచేస్తే తొలగిస్తామన్నారు.
తమ్ముళ్ల మాయాజాలం
Published Mon, Nov 16 2015 11:10 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement