వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లా వేమల మండలం నల్లచెరువు పల్లె వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు చేస్తుండుగా నాటు రివాల్వర్ దొరికింది. పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు చెక్ చేస్తుండగా ఓ ఆటోలో అనంతపురం జిల్లా కదిరికి చెందిన నాగేశ్వర్ వద్ద రివాల్వర్ లభ్యమైంది. వేముల ఎస్‌ఐ నాగేంద్ర కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
(వేముల)