విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: బీపీఎల్ కుటుంబాలకు పురుగుల్లేని బియ్యాన్ని అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి రామారావు పౌరసరఫరాల గొడౌన్ ఇన్‌చార్జిలను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో సివిల్ సప్లైస్ అధికారు లు, ఇన్‌చార్జిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ప్రతి నెలా బియ్యంతో పాటు అన్ని సరుకులూ ఒకేసారి ఇవ్వాలన్నారు.
ప్రతి నెలా 23తేదీ లోగా డీడీలు తీసేలా ఇన్‌చార్జిలు తహశీల్దార్ కార్యాల యాలతో టచ్‌లో ఉండాలన్నారు.23 తరువాత డీడీలు తీసే డీలర్లకు రూ. 500 నుంచి రూ,1000 వరకూ జరి మానాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. కేటాయింపులు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యం ఆలస్యం కాకుండా సకాలంలో ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఇందుకోసం డీఎస్‌ఓ, డీఈఓలతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.
రూట్ ఆఫీసర్లు లేకపోతే తహశీల్దార్లకు నోటీసులు
పౌరసరఫరాలు, ప్రజా పంపిణీ ద్వారా సరఫరా అవుతున్న సరుకుల వాహనాలతో తప్పనిసరిగా రూట్ ఆఫీసర్లు వెళ్లాలని ఆదేశించారు. ఒకవేళ అలా లేకుంటే తహశీల్దార్ కార్యాలయాలకు నోటీసులిస్తామని హెచ్చరించా రు. జిల్లాలో ఉన్న 15 ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా సరుకులు వెళ్తున్నప్పుడు వారితో వెళ్తూ డీలర్ వద్ద సంతకం తీసుకుని తిరిగి ఎంఎల్‌ఎస్ పాయిట్‌లోని ఇన్‌చార్జికి ఆ లెటర్ ఇవ్వాలన్నారు.
ముఖ్యంగా బాడంగి, బలిజిపేట, మెరకముడిదాం, గంట్యాడ, కొమరాడ, ఎల్ కోట, జామి, గరుగుబిల్లి, గుర్ల, రామభద్రపురం, జీఎల్‌పురంల నుంచి వాహనాలతో రూట్ ఆఫీసర్లు వెళ్లడం లేదని గుర్తించామన్నారు. ఇటీవల కాంట్రాక్టు పొందిన వాహనాల యజమానులు ఎప్పుడైనా వాహనాలను పెట్టకపోతే తహశీల్దార్‌లతో మాట్లాడి ప్రైవేటు వాహనాలను అప్పటికప్పుడు పెట్టించి దానికి సంబంధించిన అద్దెలను కాంట్రాక్టర్ డిపాజిట్ నుంచి రికవరీ చేయాలని సూచించారు. సమావేశంలో సివిల్ సప్లైస్ డీఎం ఎస్ వేణుగోపాలనాయుడు, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) భాస్కరశర్మ, అసిస్టెంట్ మేనేజర్ (ప్రజా పంపిణీ) ఆర్ రాజీ, సివిల్ సప్లైస్ సిబ్బంది, గొడౌన్‌ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
మంచి బియ్యం ఇవ్వాలి
Published Sat, Jun 7 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement