కడప : మంత్రి అహ్మదుల్లాకు మరోసారి సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి అహ్మదుల్లా రాజీనామా తన రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ జేఏసీ, మెడికోలు మంగళవారం మంత్రి అహ్మదుల్లా నివాసాన్ని ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలతో మంత్రి అహ్మదుల్లా ఇంట్లోని ఉండిపోయారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవటంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.