
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగురవేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ మహా రుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్విరామంగా ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగోల్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి , వైస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నల్లపెద్ది ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ఈ క్రతువును దిగ్విజయంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment