పశ్చిమ గోదావరి: అధికార తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార టీడీపీకి చెందిన సర్పంచ్‌ను ప్రశ్నించినందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై అక్రమ కేసు బనాయించారు. దీంతో మనస్తాపం చెందిన సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో నిప్పుంటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.
వీరవాసరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గంటసాల నాగరాజు(28)కు సర్పంచ్‌కు పంచాయతీ పైప్‌లైన్ నిర్మాణం విషయంలో వాగ్వివాదం జరిగింది. దీంతో సర్పంచ్, తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు నాగరాజుపై ఎప్రిల్ 14 కేసు నమోదు చేసి స్టేషన్‌లో రోజంతా ఉంచారు. దీంతో మనస్తాపం చెందిన నాగరాజు అదే రోజు స్టేషన్ ఆవరణలో పెట్రోలు పోసుకుని నిప్పుంటించుకున్నాడు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.టీడీపీ అక్రమ కేసులు బనాయింపును నిరసిస్తూ మృతుడి బందువులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.