మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పవర్ ప్లాంట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ఘటనలో... డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఓ ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన ప్రయాణికుడికి సమీపంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించగా, తీవ్ర గాయాలైన బస్సు డ్రైవర్ ఎంఆర్ బాబును 108లో ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పుష్కరాల రద్దీ నేపథ్యంలో బస్సు విజయవాడకు వెళుతోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన అనంతరం వారిని వేరొక బస్సులో విజయవాడకు పంపించారు.