లారీ, కారు ఢీ - ఐదుగురికి గాయాలు | road accident in kadapa distirict | Sakshi
Sakshi News home page

లారీ, కారు ఢీ - ఐదుగురికి గాయాలు

Published Mon, Mar 9 2015 2:46 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

road accident in kadapa distirict

కడప: వేగంగా వెళ్తున్న లారీ, కారును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో ఎర్రగుంట్ల రోడ్డులో జరిగింది. వివరాలు..మొద్దునురి మండలం ఉమ్మారెడ్డి గ్రామానికి చెందిన మల్లికార్జున్‌రెడ్డి తన కుటుంబంతో కలిసి సోమవారం తమ్ముడి వివాహానికి హజరై కారులో తిరిగి వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. దీంతో కారు నుజ్జునుజ్జు కావడంతో మల్లికార్జున్ రెడ్డి కారులో చిక్కుకున్నాడు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని అతనిని గ్యాస్ కట్టర్ సహాయంతో కారు బాడీని తొలగించి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు కొల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(ప్రొద్దుటూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement