
వెంటాడిన మృత్యువు
♦ ఆగి ఉన్న కారును ఢీకొన్న టిప్పర్
♦ మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై ఘటన
♦ నలుగురు చిన్నారులతో సహా డ్రైవర్‌మృతి
♦ ఐదు నిండు ప్రాణాలు బలితీసుకున్న నిద్రమత్తు
♦ తిరుమలకు వె ళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
♦ మరో నలుగురికి తీవ్రగాయాలు
♦ ఒకసారి ప్రమాదం తప్పించుకున్నా వదలని మృత్యువు
మేదరమెట్ల : గుంటూరు జిల్లా పాతగుంటూరు మారుతీనగర్ ఒకటో లైన్‌కు చెందిన మాచర్ల వీరాస్వామి విద్యుత్‌శాఖ రిటైర్డ్ ఉద్యోగి. తన కుమారుడు మురళీకృష్ణ మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మురళీకృష్ణ, మాధవి దంపతుల కుమార్తె నిత్య(తొమ్మిది నెలలు)కు పుట్టువెంట్రుకలు తీరుుంచేందుకు రెండు రోజుల క్రితమే గుంటూరు వచ్చారు. తిరుమలలో పుట్టువెంట్రుకలు తీరుుంచాలని నిర్ణరుుంచారు. జూన్ 28వ తేదీన వీరాస్వామి, గంగమ్మ దంపతులు మురళీకృష్ణ కుటుంబంతోపాటు తమ మరో కుమారుడు గోపీకృష్ణ, అల్లుడు కోటేశ్వరరావు, కోడలు మాధవి, కూతురు లక్ష్మీప్రసన్న, మనవరాళ్లు, మనుమళ్లు చిన్నకృష్ణ మనోహర్, చిన్నికృష్ణ వాసవి, శ్రీకృష్ణతో కలిసి మొత్తం 11 మంది టవేరా కారులో తిరుపతి బయలుదేరారు. మొక్కు తీర్చుకుని బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే కారులో ఇంటికి తిరుగు ప్రయూణమయ్యూరు.
ఈ క్రమంలో కారు మేదరమెట్ల దక్షిణబైపాస్ సమీపానికి రాగానే రాత్రి 2 గంటల సమయంలో డ్రైవర్ నాగరాజు నిద్రమత్తులో ఉండి ముందు వెళ్తున్న వాహనాన్ని స్వల్పంగా ఢీకొట్టాడు. అంద రూ కేకలు వేయడంతో మేల్కొని ఒక్కసారిగా బ్రేక్ వేసి, కారును కంట్రోల్ చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంజిన్ ఆగిపోయి రోడ్డుపై నిలిచిన కారు ఎంతకీ స్టార్ట్ కాలేదు. టీ తాగి కొద్దిసేపు ఆగి వెళ్దామని చెప్పినా డ్రైవర్ వినకపోవడంతో మురళీకృష్ణ, గోపీకృష్ణ, కోటేశ్వరరావు కిందకు దిగి, రోడ్డుపై ఉన్న కారును పక్కకు నెడుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. కారును 150 అడుగుల వరకూ ఈడ్చుకెళ్లి దానిపైకిఎక్కింది. కారు పూర్తిగా టిప్పరు వెనుక చక్రాల కింద ఉండిపోయింది. టిప్పర్ పైకి రావడాన్ని కారు బయట ఉన్న ముగ్గురూ గమనించి కేకలు వేస్తూ పక్కకు తప్పుకున్నారు.
కారు అద్దాల్లో నుంచి బయటకు ఎగిరిపడిన చిన్నారి...
టిప్పర్ ఢీకొన్న సమయంలో కారు డోరు కిటికీ నుంచి బయటపడిన శ్రీకృష్ణ (3) రోడ్డుపై పడిపోయూడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నాగరాజు కూడా రోడ్డుపై పడిపోవడంతో అక్కడే మృతిచెందాడు. కిందకు దిగిన ముగ్గురు మినహా, కుటుంబ సభ్యులంతా కారులోనే ఇరుక్కుపోయారు.
నాలుగు గంటల నరకయూతన...
ప్రమాదం సమాచారం అందుకున్న అద్దంకి సీఐ బైతపూడి ప్రసాద్, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్సైలు వై.పాండురంగారావు, వై.శ్రీనివాసరావు, ఎన్‌హెచ్ అంబులెన్స్ సిబ్బంది, జాతీయరహదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మూడు క్రేన్‌ల సహాయంతో కారుపై ఉన్న టిప్పర్‌ను పైకి లేపారు. కారును పక్కకు తీసి దానిలో ఇరుక్కు పోరుున వారిని బయటకు తీసేందుకు నాలుగు గంటలపాటు శ్రమించారు. ఎంత ప్రయత్నించినా వీలుకాకపోవడంతో గ్యాస్ కట్టర్ తెప్పించి కారు రేకులను కత్తిరించి క్రేన్ ద్వారా కారులోని వారిని బయటకు తీశారు.
విగత జీవులైన చిన్నారులు...
కారు వెనుకభాగంలో ఉన్న చిన్నికృష్ణ మనోహర్ (5), చిన్నికృష్ణ వాసవి (4) తీవ్రగాయూలతో మృతిచెందారు. నిత్య వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందింది. తీవ్రగాయాలైన వీరాస్వామి, గంగమ్మ, లక్ష్మీపార్వతి, మాధవికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో గంగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు నుంచి గుంటూరు లలితా నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. గంగమ్మ వెంటిలేటర్లపై ఉంది. ఈమె పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు సమాచారం.
మిన్నంటిన రోదనలు..
ఒక వైపు తమ పిల్లలు మృతి, మరో వైపు చావు బతుకుల్లో మహిళలు.. ఈ పరిస్థితుల్లో ప్రమాదం నుంచి బయట పడిన మిగతా కుటుంబసభ్యులు సైతం నిశ్ఛేష్టులయ్యూరు. చిన్నారుల మృతదేహాలను చూసి రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. చనిపోయిన చిన్నారుల మృతదేహాలను వదిలి వెళ్లలేక.. తీవ్రంగా గాయపడిన వారి వెంట ఆస్పత్రికి వెళ్లలేక వారు పడిన వేదన వర్ణణాతీతం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ...
జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా మరో వ్యక్తి మరణించారన్న సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ త్రివిక్రంవర్మ, దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసకున్నారు.