కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో రహదారి భద్రతకు పోలీసులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసులకు సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో సెట్‌కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తీసుకున్న రహదారి భద్రత చర్యల కారణంగా ప్రమాదాల సంఖ్య తగ్గించగలిగామని చెప్పారు.
అదే స్ఫూర్తితో పోలీసు అధికారులు జిల్లాలో భద్రత చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా సిబ్బంది ఎంపిక చేయాలన్నారు. అధికంగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను గుర్తించేందుకు అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment