అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
Published Fri, Dec 4 2015 12:37 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
మదనపల్లి: చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వాహనాలను దొంగలిస్తున్న పది మంది సభ్యుల గల ముఠాను శుక్రవారం మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 టిప్పర్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు సుమారు రూ.2 కోట్లు విలువైన వాహనాలను, వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement