అనంతపురం: గత సోమవారం ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం మర్చపోకముందే మరోసారి దొంగలు హల్ చల్ చేశారు. తాజాగా గురువారం తెల్లవారుజామున హంపి ఎక్స్ ప్రెస్ లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా గార్ల దిన్నె వద్ద సిగ్నల్ వైర్లు కట్ చేసి దోపిడీ చేశారు. ఎక్స్ ప్రెస్ లో ప్రవేశించిన దుండగులు మహిళా ప్రయాణికులను కత్తులతో బెదిరించి ఆభరణాలను దోచుకున్నారు. అయితే అదే సమయంలో పోలీసులు రావడంతో దొంగలు పరారయ్యారు. హుబ్లీ నుంచి మైసూరు కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు వైఎస్సార్ కడప జిల్లా ఓబుల వారిపల్లె రైల్వేస్టేషన్ దగ్గర గురువారం తెల్లవారుజామున కాచిగూడ ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ జరిగింది. కాచిగూడ - నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్ రైల్లోని జనరల్ భోగీలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు తమకు 45 గ్రాముల బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, గత సోమవారం ప్రశాంతి ఎక్స్ ప్రెస్ దొంగలు బ రైళ్లలో దోపిడీ ఘటనలు పునరావృతం అవుతున్న రైల్వే అధికారులు ఎలాంటి తీసుకోక పోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో భద్రత లేని ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైళ్లలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు
Published Thu, Apr 7 2016 11:19 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement