Hampi express
-
గార్లదిన్నె రైల్వేస్టేషన్లో తనిఖీలు
గార్లదిన్నె: అనంతపురం జిల్లా గార్లదిన్నె రైల్వేస్టేషన్లో బుధవారం రైల్వే అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రైల్వేశాఖ అడిషనల్ డీజీపీ కిషోర్‌కుమార్, రైల్వే ఎస్పీ సుబ్బారావు పాల్గొన్నారు. మార్చి 27, ఏప్రిల్ 6 న గార్లదిన్నె స్టేషన్ సమీపంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో వరసగా దొంగతనాలు చోటుచేసుకోవడంతో అధికారులు తనిఖీలు చేసేందుకు వచ్చారు. -
రైళ్లలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు
అనంతపురం: గత సోమవారం ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం మర్చపోకముందే మరోసారి దొంగలు హల్ చల్ చేశారు. తాజాగా గురువారం తెల్లవారుజామున హంపి ఎక్స్ ప్రెస్ లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా గార్ల దిన్నె వద్ద సిగ్నల్ వైర్లు కట్ చేసి దోపిడీ చేశారు. ఎక్స్ ప్రెస్ లో ప్రవేశించిన దుండగులు మహిళా ప్రయాణికులను కత్తులతో బెదిరించి ఆభరణాలను దోచుకున్నారు. అయితే అదే సమయంలో పోలీసులు రావడంతో దొంగలు పరారయ్యారు. హుబ్లీ నుంచి మైసూరు కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కడప జిల్లా ఓబుల వారిపల్లె రైల్వేస్టేషన్ దగ్గర గురువారం తెల్లవారుజామున కాచిగూడ ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ జరిగింది. కాచిగూడ - నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్ రైల్లోని జనరల్ భోగీలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు తమకు 45 గ్రాముల బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత సోమవారం ప్రశాంతి ఎక్స్ ప్రెస్ దొంగలు బ రైళ్లలో దోపిడీ ఘటనలు పునరావృతం అవుతున్న రైల్వే అధికారులు ఎలాంటి తీసుకోక పోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో భద్రత లేని ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హంపి ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ
అనంతపురం జిల్లా గార్లదిన్నె రైల్వే స్టేషన్ సమీపంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం అర్ధరాత్రి సమయంలో దోపిడీ జరిగింది. హుబ్లి నుంచి మైసూరు వెళుతున్న 16591 నంబర్ గల రైలు గార్లదిన్నె స్టేషన్ సమీపంలోకి రాగానే దొంగలు రెండు బోగీలలో ప్రయాణికుల నుంచి ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హంపి ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ దొంగల బీభత్సం
-
హంపి ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ దొంగల బీభత్సం
గుంతకల్లు: హుబ్లీ నుంచి బెంగళూరు వెళుతున్న హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు. గౌరి బిదనూరు వద్ద దొంగలు రైలులోకి ప్రవేశించి ముగ్గురు మహిళల మెడల్లో ఉన్న నగలను తెంపుకుని పరారయ్యారు. వారం రోజుల్లో హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు పడటం ఇది రెండోసారి. కాగా ఈ నెల 5వ తేదీన గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని కల్లూరు-గార్లదిన్నె మార్గం మధ్యలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. కాగా వరుసగా హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు దోపిడీకి పాల్పడుతుండటంతో ప్రయాణికులు బెంబేలు ఎత్తుతున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైవేల్లో దొంగతనాలకు పాల్పడే 20 నుంచి 30 మంది సభ్యులున్న అంతర్ రాష్ర్ట ముఠా పని అయి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి యత్నం
* రైల్లోనే ప్రయాణించిన ముగ్గురు దుండగులు * రైలు ఆపిన చోట వేచి ఉన్న మరో 20 మంది * చైన్ లాగి దోపిడీకి యత్నం, కేకలు వేసిన ప్రయాణికులు * గాలిలోకి కాల్పులు జరిపిన జీఆర్పీ పోలీసులు గుంతకల్లు, న్యూస్‌లైన్: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని కల్లూరు-గార్లదిన్నె మార్గం మధ్యలో శనివారం తెల్లవారుజామున హంపి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. రైల్వే ఎస్పీ ఎస్.జె. జనార్దన్ కథనం మేరకు.. హుబ్లీ నుంచి బెంగళూరు వెళ్లే హంపి ఎక్స్‌ప్రెస్ (నం-16591)లో పక్కా ప్రణాళికతో దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులు ఎస్-2 కోచ్‌లో, మరో ముగ్గురు ఎస్-8 కోచ్‌లో ప్రయాణికుల్లాగా ఎక్కారు. దోపిడీకి పాల్పడాలనుకున్న చోట మరో 20 మంది మోహరించారు. కల్లూరు-గార్లదిన్నె మార్గంలోని 237/9 కి.మీ వద్దకు చేరుకోగానే ఎస్-2 కోచ్‌లోని దొంగలు చైను లాగి రైలును నిలిపివేశారు. దీంతో ఎస్-5 కోచ్‌లో ఉన్న అనంతపురం జీఆర్పీ కానిస్టేబుళ్లు శివప్రసాద్, నరసింహులు అప్రమత్తమై ఎస్-2 కోచ్ వద్దకు చేరుకున్నారు. ముసుగులు ధరించిన దొంగలు ముగ్గురు ఎస్-2 బోగిలోని ప్రయాణికులను బెదిరిస్తుండటాన్ని గుర్తించారు. పోలీసుల రాకను పసిగట్టిన ఆ ముగ్గురూ రైలు నుంచి దూకి ముళ్లపొదల్లోకి పరుగులు తీశారు. ఇంతలో ఎస్-7 బోగీలో కిటికీల పక్కన కూర్చుని ఉన్న ప్రయాణికులు రత్నమ్మ (గదగ్), చిన్నమ్మ (హుబ్లీ)ల నుంచి నగలు లాక్కోవడానికి ముందుగా అక్కడ వేచివున్న 20 మందితో కూడిన దొంగల ముఠా యత్నించిం ది. బెంబేలెత్తిన ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేయడంతో ఎస్-2 బోగీ వద్ద నుంచి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతూ పరుగెత్తుకుంటూ వ చ్చారు. దీంతో దొంగల ముఠా అక్కడి నుంచి పారిపోయింది. బోగీల ప్రధాన ద్వారాలు మూసి ఉండటంతో కిటికీల పక్కన కూర్చుని ఉన్న ప్రయాణికుల మెడలో గొలుసుల చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. హైవేల్లో దొంగతనాలకు పాల్పడే 20 నుంచి 30 మంది సభ్యులున్న అంతర్ రాష్ర్ట ముఠా పని అయి ఉండొచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. చోరీ జరగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లకు నగదు రివార్డు అందజేస్తున్నట్లు తెలిపారు. -
హంపి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగలు హల్చల్
అనంతపురం జిల్లా కల్లూరు వద్ద హంపి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం దోపిడి దొంగలు హల్చల్ చేశారు. ఎస్ 7, ఎస్ 8 బోగిలో దోపిడి దొంగలు ప్రవేశించి ప్రయాణికులను కత్తులతో బెదిరించారు. ఆ క్రమంలో రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై...గాలిలోకి కాల్పులు జరిపారు. దాంతో దోపిడి దొంగలు పరారైయ్యారు. ఆ రైల్వే పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఘటన గత అర్థరాత్రి చోటు చేసుకుంది. హంపీ ఎక్స్‌ప్రెస్ రైలు గుంతకల్లు నుంచి హిందూపురం వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది.