
కడపలో భారీ చోరీ
కడప: వైఎస్సార్ జిల్లా కడపలోని రవీంద్రనగర్‌లో సాదిక్ అలీ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. వ్యక్తిగత పనుల నిమిత్తం సాదిక్ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం వేరే ఊరికి వెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంటిలోపలికి వెళ్లి చూసేసరికి బీరువా పగలగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం, 3 సెల్‌ఫోన్‌లు, 3 వాచీలు, ఒక ఐపాడ్ చోరీకి గురైనట్టు గుర్తించారు. దొంగిలించిన సొత్తు విలువ రూ. 2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.