Sadiq Ali
-
Hyd: సీఐ ప్రాణాల్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్
హైదరాబాద్, సాక్షి: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ఎల్బీ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మృతి చెందగా.. ఎస్సై ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కార్ యూటర్న్ చేస్తు రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఒకరు మృతి చెందగా. మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీగా గుర్తించారు. అలాగే.. గాయపడిన వ్యక్తిని నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కాజా వల్లి మోహినుదిన్గా గుర్తించారు. వీళ్లిద్దరూ మలక్‌పేటలోని క్వార్టర్స్‌లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్లో ఓ ఫంక్షన్‌ను వెళ్లి వస్తుండగా.. ఈ ఘోరం జరిగింది. కారుపై ‘డేంజర్’ ఛలాన్లు ఇదిలా ఉంటే.. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కారు వినుషాశెట్టి అనే పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అంతేకాదు.. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు ఉండడం గమనార్హం. -
కడపలో భారీ చోరీ
కడప: వైఎస్సార్ జిల్లా కడపలోని రవీంద్రనగర్‌లో సాదిక్ అలీ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. వ్యక్తిగత పనుల నిమిత్తం సాదిక్ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం వేరే ఊరికి వెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంటిలోపలికి వెళ్లి చూసేసరికి బీరువా పగలగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం, 3 సెల్ఫోన్లు, 3 వాచీలు, ఒక ఐపాడ్ చోరీకి గురైనట్టు గుర్తించారు. దొంగిలించిన సొత్తు విలువ రూ. 2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యాభర్తల దారుణ హత్య
చందానగర్ : తలపై మోది, గొంతుకు తాడు బిగించి భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాసు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడికిచెందిన సాదిక్ అలీ(55)కి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సలీమా బేగం చనిపోయింది. ఆమెకు ముగ్గురు కుమారులు. రెండవ భార్య షమీమ్ బేగానికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పది సంవత్సరాల క్రితం జీడిమెట్లకు చెందిన వివాహిత ఆశాబీ(50)ని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆశాబీకీ ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆశాబీతో కలిసి శేరిలింగంపల్లిలోని గోపీనగర్లో ఆరు నెలలుగా నివాసం ఉంటూ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా 20 రోజుల క్రితం ఆశాబీతో కలిసి గ్రామానికి వెళ్లాడు. అక్కడి గొడవ జరగడంతో చిరిగిన దుస్తులతో భార్యాభర్తలు గోపీనగర్‌కు వచ్చారు. ఆదివారం రాత్రి 11 గంటలకు నిద్రకు ఉపక్రమించారని ఇంటి యజమాని శాంతా యాయి తెలిపారు. తెల్లవారినా తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమాని తలుపులు తీసి చూడగా రక్తపు మడుగులో సాధిక్, ఆశాబీచనిపోయి ఉన్నారు. ఇద్దరి తలపై బలమైన వస్తువుతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. తలపై కొట్టిన తరువాత గొంతుకు తాడుతో బిగించారు. చనిపోయారని నిర్థారించుకున్న తరువాత గుర్తు తెలియని దుండగులు ఉడాయించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆస్తి తగాదాలే కారణం? ఇటీవల ఇల్లు అమ్మగా సాదిక్‌కు రెండు లక్షల రూపాయలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్తి తగాదాలు హత్యకు కార ణం కావచ్చని పోలీసులు భావిస్తునానరు. ఇత ర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటన స ్థలాన్ని మాదాపూర్ డీసీపీ క్రాంతి రాణా టాటా, ఏసీపీ శ్రీధర్, సీఐ వాసు, క్లూస్ టీం సందర్శించారు.