నేడు భీమవరంలో ఎస్పీ బాలుకు సన్మానం | S.P.Balasubramaniam to Be Honored in bimavaram | Sakshi
Sakshi News home page

నేడు భీమవరంలో ఎస్పీ బాలుకు సన్మానం

Published Sat, May 30 2015 10:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

S.P.Balasubramaniam to Be Honored in bimavaram

పశ్చిమగోదావరి: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సన్మానం జరగనుంది. డీఎన్‌ఆర్ ఆర్ట్స్ కళాశాలలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటిక పోటీలు శనివారం నుంచి జరగనున్నాయి. వీటిలో భాగంగా సాయంత్రం 6 గంటలకు ఎస్పీ బాలును ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా సన్మానించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే, గాయని సునీతకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నామని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎస్పీ బాలు దంపతులు శుక్రవారమే భీమవరం చేరుకున్నారు. స్థానికంగా మావూళ్లమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement