జాతీయ అవార్డు గ్రహీత పి.కృష్ణమూర్తి (ఫైల్‌ఫోటో)
తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాతీయ అవార్డు గ్రహీత, ఆర్ట్ చిత్రాల దర్శకుడు పి. కృష్ణమూర్తి(77) కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన తన నివాసంలో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య కారణల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. భారతీయ, ఇమ్సాయ్ అరసన్ 23 ఆమ్ పులికేసి వంటి తమిళ చిత్రాలకు పని చేసినందుకు గాను వరుసగా ఐదుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు కృష్ణమూర్తి. ఇక ఆయన అంత్యక్రియలు చెన్నైలోని నివాసం మడిపక్కంలో సోమవారం మధ్యాహ్నం జరగనున్నాయి. తీరప్రాంత పట్టణం పూంపూహార్‌లో జన్మించిన కృష్ణమూర్తి 1975 లో జీవీ అయ్యర్స్ ‘హంసా గీత’ కన్నడ చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 18 వ శతాబ్దపు కర్ణాటక సంగీతకారుడు భైరవి వెంకటసుబ్బయ్య జీవితం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను అందుకుంది. కృష్ణమూర్తికి మొదటి జాతీయ పురస్కారం జీవీ అయ్యర్ దర్శకత్వం వహించిన ‘మాధ్వాచార్య’ చిత్రం వల్ల దక్కింది. ఇక వీరిద్దరూ ‘ఆది శంకరాచార్య ’(1983), ‘మాద్వాచార్య’ (1986), ‘రామానుజచార్య’ (1989) వంటి చిత్రాల్లో పనిచేశారు.
కృష్ణమూర్తికి చిన్నతనం నుంచి కూడా నటన అంటే అమితమైన ఆసక్తి. అతను మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారు. ఆ తరువాత సినిమాల్లోకి ప్రవేశించే ముందు థియేటర్ నాటకాలు, నృత్య ప్రదర్శనల కోసం సెట్ల రూపకల్పన పని చేశారు. రచయితలు జయకాంతన్, అశోకమిత్రన్, నాటక రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్, థియేటర్ పర్సనాలిటీ బి.వి.కరాంత్, గాయకుడు బాలమురళి కృష్ణ వంటి వ్యక్తుల కృష్ణమూర్తిని సినిమాలకు పరిచయం చేశారు. 40 సంవత్సరాల కాలంలో, కృష్ణమూర్తి సంస్కృతం, హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళం, మలయాళం, ఫ్రెంచ్, ఆంగ్ల చిత్రాలకు పని చేశారు. (చదవండి: కరోనా వైరస్ గురించి అతనికి ముందే తెలుసా?)
కృష్ణమూర్తి తమిళంలో ఇందిరా, సంగమం, తెనాలి, కుట్టి, పాండవర్ భూమి, అజాగి, భారతి, జూలీ గణపతి, ఇమ్సాయ్ అరసన్ 23 ఆమ్ పులికేసి, నాన్ కడావుల్ ఉన్నాయి. మలయాళంలో స్వాతి తిరునాల్ (1987), వైసాలి (1988), ఓరు వడక్కన్ వీరగథ (1989), పెరుమ్తట్చన్ (1991) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా, భారతి చిత్రానికి గాను ఆయన రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఇక 2014లో విడుదలైన రామానుజన్ అతని చివరి తమిళ చిత్రం. కృష్ణమూర్తి ఎం నైట్ శ్యామలన్ (ప్రేయింగ్ విత్ యాంగర్), జగ్ ముంధ్రా (పెర్ఫ్యూమ్డ్ గార్డెన్) వంటి దర్శకులతో కూడా పనిచేశారు. ఆయన మరణవార్త తెలియడతో దర్శకులు భారతీరాజా, చింబు దేవన్ వంటి వారు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment