ఐపిఎంలు అందించే జిల్లాగా మహబూబ్‌నగర్ తన ఖ్యాతిని మరో మారు నిలుపుకుంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు ఎస్పీలు ఈ ప్రతిష్టాకర అవార్డు సాధించగా ఇప్పుడు ఎస్పీ నాగేంద్రకుమార్ ఆ అవార్డును అందుకొని జిల్లాకు రికార్డును సాధించారు. మూడో సారి ఈ అవార్డు ఇక్కడి పోలీస్ బాసులకు రావడం పట్ల పోలీస్ యంత్రాంగమూ సంబరపడుతోంది.
మహబూబ్‌నగర్ క్రైం,న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణలో అ త్యుత్తమ సేవలందించిన వారికి భార త ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ జిల్లా ఎ స్‌పీ డి.నాగేంద్రకుమార్‌కు దక్కింది. ఈ మేరకు శనివారం కేంద్ర హోంశాఖ ఐపిఎంలను ప్రకటించింది.
అగస్టు 15న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ మెడల్‌ను అందుకోనున్నారు. ఆయన 1990లో గ్రూప్ వన్ ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. మొదటి పోిస్టింగ్ రామగుండం . తిరిగి 2010లో ఐపీఎస్ హోదాతో ఎల్‌బీనగర్ డీసీపీగా పని చేశారు. 2012 జులై నుంచి జిల్లా ఎస్పీగా భాధ్యతలు చేపట్టారు. ఆయనది తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి. అంతకు ముందు 1984లో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికై పంచాయితీరాజ్ శాఖలో జేఈగా, విజయనగరం జిల్లాలో కొంతకాలం పనిచేశారు.
ఉద్యోగం చేస్తునే రెండు సార్లు సివిల్స్ రాసి ఇంటర్వూ వరకు వెళ్లారు. రాష్ట్రంలో పని చేసిన నలుగురు గవర్నర్‌లు రామేశ్వర్‌ఠాకూర్, ఎన్.డి. తివారీ, సుశీల్ కుమార్ షిండే, ప్రస్తుత గవర్నర్ నరసింహంల వద్ద భద్రతాధికారిగా కూడా పనిచేశారు. భారత పోలీస్ వ్యవస్థలోనే అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ మెడల్ దక్కడం పట్ల ఎస్‌పీ డి.నాగేంద్రకుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతర సేవ చేయడం ఆత్మ తృప్తిగా ఉంటుందన్నారు. సర్వీస్‌లో ఉన్నన్నాళ్లూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ముగ్గురు పోలీస్ బాస్‌లకు అవార్డులు...
2011నుంచి 14 వరకు జిల్లాలో పని చేసిన ముగ్గురు ఎస్పీలకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్స్ వరించాయి. 2011లో జిల్లా ఎస్పీగా పని చేసిన సుధీర్‌బాబు, 12లో అప్పటి ఎస్పీగా పని చేసిన లక్ష్మీరెడ్డిని వరించగా ముచ్చటగా మూడో సారి ప్రస్తుత ఎస్పీగా భాధ్యతలు నిర్వహిస్తున్న నాగేంద్రకుమార్‌లకు ఐపీఎం వరించడంపై జిల్లా పోలీసులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్పీకి ఇండియన్ పోలీస్ మెడల్
Published Sun, Jan 26 2014 3:47 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement