సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేర 101 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర ముఖ్యోద్దేశాన్ని కార్తీక్‌రెడ్డి వెల్లడించా రు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుందని, రోజూ సగటున 20-22 కి.మీ. మేర పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ఆరె మైసమ్మ దేవాలయం నుంచి మొదలయ్యే యాత్రను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. 12న తాం డూ రు భద్రేశ్వర్ చౌక్‌లో యాత్ర ముగింపు సభను నిర్వహించనున్నట్లు వె ల్లడించారు. వ్యక్తిగత అజెండాకు తావులేకుండా పార్టీ పటిష్టత కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా తన యాత్రకు సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తనకు సూచించారని కార్తీక్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్ర నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. అందులోభాగంగానే తెలంగాణ నవ నిర్మాణ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. ‘తెలంగాణ ఇచ్చింది మేమే... దాని పునర్నిర్మాణ బాధ్యత మాదే’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్టు చెప్పారు. పాదయాత్రకు పార్టీ పెద్దల సంపూర్ణ ఆశీస్సులు, దీవెనలు ఉన్నాయని, కాంగ్రెస్ బలోపేతానికి చేస్తున్న యాత్ర కావడంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. తన యాత్రకు పీసీసీ కూడా అనుమతి ఇచ్చిందని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, టీటీడీ మాజీ సభ్యుడు కాలె యాదయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ వెంకటస్వామి, పార్టీ సీనియర్ నేత ఎ.మురళీధర్‌రెడ్డి, శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
8 నుంచి కార్తీక్ పాదయాత్ర
Published Sat, Jan 4 2014 11:42 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement