విజయనగరం క్రైం: పట్టణంలోని కె.ఎల్.పురానికి వెళ్లే గెంజిపేట జంక్షన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ ద్విచక్రవాహనదారుడు మృత్యువు నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, టాటా ఏస్ వ్యాన్ డ్రైవర్ సకాలంలో స్పందించటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కామాక్షినగర్‌లో నివాసం ఉంటున్న జాగరపు కన్నంనాయుడు గూడ్స్‌షెడ్ ప్రాంతంలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కె.ఎల్.పురంలో విద్యుత్ వైర్లు తెగిపోయినట్టు సమాచారం అందటంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
గెంజిపేట జంక్షన్ వద్దకు వచ్చేసరికి కలెక్టరేట్ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, కె.ఎల్.పురం నుంచి వస్తున్న టాటా ఏస్ వ్యాన్ ల మధ్య పడిపోయి బస్సు కిందకు వెళ్లిపోయారు. రెండు వాహనాల డ్రైవర్లు గమనించి చాకచక్యంగా వ్యవహరించటంతో ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు ఆయనను బస్సు కింద నుంచి తీసి సపర్యలు చేశారు. తర్వాత 108 వాహనంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ ఎ.నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృత్యువు అంచు నుంచి క్షేమంగా..
Published Thu, Jun 25 2015 5:33 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM
Advertisement